ఈటల వ్యూహం :సర్దార్ రవీందర్ సింగ్.. విజయం సాధిస్తారా..!

frame ఈటల వ్యూహం :సర్దార్ రవీందర్ సింగ్.. విజయం సాధిస్తారా..!

MOHAN BABU
 ఈటల రాజేందర్ వ్యూహాలు, ఆలోచనలు చాలా డిఫరెంట్ గా ఉంటాయి. ఆయన మాటలు కూడా  ఆచితూచి ఆలోచింపజేసే విధంగా మాట్లాడతారు అని చెప్పవచ్చు. ఏదైనా నిర్ణయం తీసుకున్నారంటే దాని వెనక  ఏదో పెద్ద రాజకీయ వ్యూహమే ఉండి ఉంటుంది. అలాంటి వ్యూహాన్ని  ప్రస్తుతం కరీంనగర్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఉపయోగించారా..! బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కరీంనగర్ లో బీజేపీ పోటీ చేయడం లేదని, అలాగే ఎవరికి కూడా  మద్దతు ఇవ్వదని  చెప్పిన వినకుండా ఈటల రాజేందర్ మాత్రం సర్దార్ రవీందర్ సింగ్ ను  ఇండిపెండెంట్ గా  బరిలోకి దింపి, తన అనుచరగణంతో  విజయ బావుటా ఎగరవేయడానికి అన్ని ప్రయత్నాలు చేసి పెట్టారు. అయితే ఇప్పటికే  హుజురాబాద్ ఉప ఎన్నికల్లో రాష్ట్ర ప్రభుత్వం  ఉద్దండ నాయకులు మొత్తం ప్రచారంలో ఉన్న, కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినా  ఈటెలను ఢీ కొట్టలేదు. ఇంతమంది కలిసిన  ఈటల రాజేందర్ ముందు పాచికలు పారలేదు.


 దీంతో ఆయన విజయం సాధించారు. అదే క్రేజ్ తో  ఎలాగైనా కరీంనగర్ రాజకీయాల్లో  పట్టు సాధించాలని ఈటల ప్రయత్నాలు చేస్తున్నారు. ముందు ప్రయత్నంగా తన ప్రధాన అనుచరుడైన సర్దార్ రవీందర్ సింగ్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీలో ఉంచాడు. స్థానిక సంస్థల ప్రతినిధులు అందరితో, అసమ్మతి నాయకులతో  మాట్లాడి వారందరినీ తమ వైపు తిప్పుకోవడానికి వీటిలో చాలా  ప్రయత్నాలు చేశారని, తెలుస్తోంది. మరి ఈటల బిజెపి పార్టీకి వ్యతిరేకంగా  ఈ విధంగా ప్రవర్తిస్తున్నారా లేదా బీజేపీ అధిష్టానం ప్లాన్ ప్రకారం  ఈ ఒక్క ఎమ్మెల్సీ  ఎన్నికను విజయతీరాలకు తీసుకెళ్లి, రాబోయే ఎలక్షన్లలో అన్ని సీట్లను గెలుచుకోవడానికి గట్టి ప్రయత్నం మొదలు పెట్టారా.. దీనికి బిజెపి అధిష్టానం సపోర్టు ఉందా..? అనేక కోణాల్లో ఆలోచించాల్సి ఉంటుంది. ఒకవేళ సర్దార్ రవీందర్ సింగ్ గెలిస్తే ఈటల రాజేందర్ కు ఇటు కరీంనగర్లో మరియు తెలంగాణ మొత్తం  ఎంతో క్రేజ్ పెరుగుతుంది.


దీంతో ఆయన బిజెపి పార్టీలో ఉన్నా తిరుగులేని నాయకుడిగా ఎదగ వచ్చని ప్లాన్తో ఈ రవీందర్ సింగ్ గెలుపు ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారని తెలుస్తోంది. రాష్ట్రంలో  మిగతా ఐదు ఎమ్మెల్సీ స్థానాలు ఒక ఎత్తయితే, ఈ కరీంనగర్ ఎమ్మెల్సీ స్థానం మరొక ఎత్తు. ఎందుకంటే  హుజురాబాద్ స్థానం కైవసం చేసుకున్న ఈటెల, సర్దార్ రవీందర్ సింగ్ కూడా గెలిపిస్తే రాబోయే ఎన్నికల్లో  తెరాసకు గట్టి పోటీ ఇచ్చే నాయకుడిలా ఈటల రాజేందర్ మారవచ్చని దీంతో ఇక రాజేందర్ తిరుగు ఉండదని తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: