రివ్యూ: సికిందర్ మూవీ రివ్యూ.. రష్మిక- సల్మాన్ ఖాన్ హిట్ కొట్టారా..?
సికిందర్ చిత్రం చూసిన చాలామంది సాధారణ ఆడియన్స్ మాత్రం పెద్దగా నచ్చలేదని ఇదేం సినిమా రా బాబు అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఈ సినిమా అవుట్ డేట్ కథ .. బిజిఎం దరిద్రంగా ఉందని కొన్ని యాక్షన్ సీన్స్ మాత్రం బాగున్నాయంటు తెలుపుతున్నారు..సికిందర్ సినిమా చూసిన అభిమానులు మాత్రం ప్రశంసిస్తూ ఉన్నారు.
మరి కొంతమంది మాత్రం సికిందర్ సినిమా బ్లాక్ బాస్టర్ అని.. ఫస్టాఫ్ స్ట్రాంగ్ గా ఉందని, బిజిఎం, యాక్షన్ సన్నివేశాలు సాలిడ్ గా ఉన్నాయంటూ తెలియజేస్తున్నారు. ఇంటర్వెల్ తర్వాత వచ్చే సన్నివేశాలు థియేటర్లో అతుక్కొని పోయి చూశారా ఉన్నాయంటు తెలియజేస్తున్నారు.
మరి కొంతమందిని నెటిజన్స్ సల్మాన్ ఖాన్ ఎంట్రీ అదిరిపోయిందని బిజిఎం సూపర్ గా ఉందని మాస్ అండ్ లుక్కులు సల్మాన్ అదిరిపోయారంటూ తెలియజేస్తున్నారు. రష్మిక యాక్టింగ్ అందం కూడా ఈ సినిమాకి బాగా కలిసి వచ్చిందని కామెంట్స్ చేస్తున్నారు.
మొత్తానికి సల్మాన్ ఖాన్ అభిమానులను అయితే ఈ సినిమా మెప్పించిందని చాలా రోజుల తర్వాత అదిరిపోయే సీన్స్ పడ్డాయని కూడా తెలియజేస్తున్నారు. థియేటర్లలో సికిందర్ సినిమా బాక్సాఫీస్ వద్ద కలెక్షన్స్ రాబడుతుందని తెలియజేస్తున్నారు. మరి ఏ మేరకు మొదటి రోజు కలెక్షన్స్ రాపడుతుందో చూడాలి అలాగే పూర్తి రివ్యూ తెలియాలి అంటే మరొక కొన్ని గంటలు ఆగాల్సిందే.