కరోనా వ్యాక్సిన్ ఆ టైమ్‌లో తీసుకుంటే యమా పవర్‌ఫుల్..?
అయితే.. కరోనా టీకా డోసు ఎప్పుడు వేయించుకోవాలి.. టీకాను రోజులో ఏ సమయంలో తీసుకున్నా ఒక్కటేనా.. టీకాను ఏ సమయంలో తీసుకుంటే ఎక్కువ ప్రభావం ఉంటుంది.. ఇలా చాలా అనుమానాలు ఉన్నాయి. ఇప్పుడు ఈ అనుమానాలకు తెర దించుతోంది ఓ అధ్యయనం.
కరోనా టీకాను ఉదయంతో పోలిస్తే.. మధ్యాహ్నం తీసుకుంటే యాంటీబాడీ స్థాయిలు ఎక్కువగా ఉంటాయని ఈ తాజా అధ్యయనం చెబుతోంది. రోజులో ఏ టైమ్‌లో వ్యాక్సిన్ తీసుకున్నామనేదానిపై యాంటీబాడీల కెపాసిటీ ఆధారపడి ఉంటుందని ఈ అధ్యయనం చెబుతోంది.
ఇంతకీ ఈ అధ్యయనం ఏంటి.. దాని ప్రాముఖ్యత ఏంటో చూద్దాం.. ఉదయం కన్నా మధ్యాహ్నం టీకాలు తీసుకున్నవారిలో యాంటీబాడీలు ఎక్కువగా ఉంటాయని చెప్పింది జర్నల్ ఆఫ్ బయోలాజికల్ రిథం అనే సంస్థ. ఈ అంశంపై ఈ సంస్థ ఓ అధ్యయనాన్ని ప్రచురించింది. మనిషి 24 గంటల కాలచక్రంలో శరీరంపై వ్యాధి, టీకా ప్రభావానికి కూడా తగిన సమయం ఉంటుందని ఈ అధ్యయనం చెబుతోంది. ఈ అధ్యయనంలో బ్రిటన్‌లో టీకాలు తీసుకున్న 2 వేల 190 మంది ఆరోగ్య కార్యకర్తలు పాల్గొన్నారు.
ఈ అధ్యయనంలో తేలిందేమిటంటే.. మధ్యాహ్నం తర్వాత టీకాలు తీసుకున్న వారందరికీ యాంటీబాడీల స్పందన ఎక్కువగా ఉందట. అయితే.. ఇలా టీకా తీసుకున్న తర్వాత యాంటీబాడీలు ఎక్కువగా ఉండడం కొన్నిఔషధాలు, నిద్ర లేమీ, షిఫ్ట్ పనిదినాలపై కూడా ఆధార పడి ఉంటుందట.