ఆర్ఆర్ఆర్ ఎలా ఉన్నా హిట్టే?

RATNA KISHORE

మ‌నం వ్య‌క్తుల భ‌జ‌న మాని ఆలోచిస్తే
చాలా సినిమాలు ఇంకా బాగా అర్థం అవుతాయి
ఒక ప్రాంతం అస్తిత్వం న‌డ‌వ‌డి అన్న‌వి సినిమా
ఒక్క‌టే కాపాడుతుంది అని చెప్ప‌డంలో అవివేకం ఉంది
సినిమా కూడా కాపాడాలి అని చెప్ప‌డం కూడా అవివేక‌మే
ఒక ప్రాంతం ఒక చ‌రిత్ర ఒక గ‌మ‌న రీతి అన్న‌వి జ‌గ‌త్తుకు తెలిసిన
జ‌క్క‌న్న అనే వ్య‌క్తో ద‌ర్శ‌కుడో లేదా మ‌రొక‌రో నిర్ణ‌యిస్తార‌ని ఎలా అనుకోగ‌లం?
క‌నుక వ్య‌క్తుల భ‌జ‌న కార‌ణంగా సినిమాల స్థాయిని నిర్ణ‌యించ‌డంలో ఎంత‌టి అజ్ఞానం ఉందో ఎవ‌రికి వారు తెల్సుకుంటే మేలు.



మాగ్నిఫికేష‌న్ ఆఫ్ థాట్ అన్న‌ది సినిమాను న‌డిపిస్తుంది అని గ‌తంలో చెప్పేను. ద‌రిద్ర‌గొట్టు ఆలోచ‌న‌ల నుంచి బ‌య‌ట‌కు వ‌చ్చి సినిమా చూస్తే మంచి కొంత చెడు ఎంత అన్న‌వి కూడా తెలిసి ఛ‌స్తాయి. ఆర్ఆర్ఆర్ సినిమాతో రాజ‌మౌళి స్థాయి పెరిగి పెద్ద‌ద‌యిపోతుంది అని చాలా రొటీన్ వ‌ర్డ్స్ రాయ‌ను. వారి స్థాయి పెరిగినా త‌గ్గినా సినిమా స్థాయిని పెంచే ప‌నులు ఆయ‌న చేసినా చేయ‌కున్నా ఇవాళ ఇండ‌స్ట్రీని న‌డిపేది ఆర్ఆర్ఆర్ ఒక్క‌టే కాదు. ద‌ర్శ‌కుడు అంటే రాజ‌మౌళీ ఒక్క‌డే కాదు. ఇవి తెల్సుకుని ఒక సినిమాను విశ్లేషించ‌డం నేర్చుకోవాలి. క‌లెక్ష‌న్స్ అన్న‌వి త‌ప్ప‌క వ‌స్తాయి. క‌నుక నిర్మాత డీవీవీ దాన‌య్య ఒక గుండెబాదుకోన‌వ‌స రం లేదు. సినిమాకు ఖర్చుచేసిన ప్ర‌తి రూపాయిలో స‌గం ఇప్ప‌టికే ఏదో ఒక దారిలో వ‌చ్చే ఉంటుంది. ఇంకా ఆ సినిమా ట్రైల‌ర్ చూశాను. పెద్ద‌గా ఏం లేదు. ఆయ‌న చెప్పాల‌నుకున్నంటున్న‌ది చెప్పాడు స‌రే.. కానీ వాటిలో ఆయ‌న చూపించిన కొత్త‌ద‌నం ఏమీ లేదు. క‌నుక ఆర్ఆర్ఆర్ భ‌జ‌న ఆపి కొత్త‌గా ఆలోచించడం మొద‌లుపెడితే బెట‌ర్. బాహుబ‌లి కూడా ఇలానే ఊరించి ఊరించి డ‌బ్బులు పిండాడు. త‌ప్పేం లేదు. ఈ సినిమాలో తెలంగాణ జీవితం చూపిస్తున్న‌డు. మంచిదే! నిజంగా ఆ ప్రాంతం పై వీరికి ఉన్న అవ‌గాహ‌న ప్రేమ ఉంటే త‌ప్ప‌క ఆనందించాలి. మ‌నం సినిమాను సామాజిక వ‌స్తు కోణం నుంచి చూడం క‌నుక భ‌జ‌న చేస్తుంటాం. ఆ విధంగా కాకుండా ఏద‌యినా ఆలోచ‌న అన్న‌ది మొదలు పెడితే త‌ప్ప‌క ఎంబోజింగ్ ఆఫ్ థాట్ అన్న‌ది త‌ప్ప‌క తెలియును.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: