క్రాష్ : మృత దేహాలను గుర్తించడం కష్టమే... స్పష్టం చేసిన రక్షణ శాఖ


తమిళనాడులోని నీలగిరి కనుమల్లో జరిగిన హెలికాప్టర్ ప్రమాదంలో చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ జనరల్ బిపిన్ రావత్  తో పాటు మరో 12 మంది మరణించిన ఒక రోజు తర్వాత, భారత వైమానిక దళం ప్రమాదం జరిగిన తీరు, దాని తీవ్రత కారణంగా అన్ని మృతదేహాలను గుర్తించడం కష్టమని  పేర్కోంది
" హెలికాఫ్టర్  ప్రమాదం  ఘటన  తీవ్రతమైనదని కావడంతో వారికి మృత దేహాలను  సరిగా  గుర్తించడంలో  ఇబ్బందులు ఎదుర్కోవసి వచ్చింది.  మృతుల బంధువులు, సన్నిహితులు మనస్త త్వం  వారి భావోద్వేగాలను పరిగణనలోకి తీసుకున్నాం.  సానుకూల గుర్తింపు కోసం సాధ్యమైన అన్ని చర్యలు తీసున్నాం " అని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి.
జనరల్ బిపిన్ రావత్, ఆయన భార్య మధులికా రావత్, ఆయన డిఫెన్స్ అడ్వైజర్ బ్రిగేడియర్ ఎల్ఎస్ లిడర్ సహా నలుగురి మృతదేహాలను మాత్రమే  సరిగ్గా  గుర్తించినట్లు వారు తెలిపారు. మరణించిన వారందరి సన్నిహితులు,  కుటుంబ సభ్యులు అందరూ  ఢిల్లీకి చేరుకుంటున్నారు, అక్కడ వారిని, తమ వారి అవశేషాలను గుర్తించమని అడుగుతారు.
" ఖచ్చితమైన గుర్తింపు కోసం సన్నిహిత కుటుంబ సభ్యుల సహాయంతో పాటు,  శాస్త్రీయ చర్యలతో  గుర్తించే ప్రయత్నం చేస్తాం. బంధువులు తమవారిని  గుర్తించిన తర్వాత మాత్రమే మృత దేహాలను బంధువులకు  అంద చేస్తారు" అని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. "పాజిటివ్ ఐడెంటిఫికేషన్ ప్రక్రియ పూర్తయిన తర్వాత" దగ్గరి బంధువులతో సంప్రదించిన తరువాత  పూర్తిస్థాయి    సైనిక  లాంఛనాలు నిర్వహించ నున్నట్లు వారు తెలిపారు.
 హెలికాఫ్టర్ క్రాష్ జరిగిన ఘటనా స్థలం  వద్ద లభించిన అవశేషాలన్నింటినీ వెల్లింగ్టన్ నుంచి సూలూర్‌కు రోడ్డు మార్గంలో తరలించినట్లు తెలిపారు. కాగా మార్గ మధ్యలో ఓ ఘాట్ రోడ్డు వద్ద మృత దేహాలను తీసుకు వెళుతున్న అంబలెన్స్ లు లో ఒక వాహనం ముందు వెళుతున్న మరో అంంబులెన్స్ ను ఢీ కొనింది. అయితే పెద్ద ప్రమాదం సంభవించ లేదు. సూలూరు నుంచి అందరి  మృత దేహాలు ఎయిర్ ఫోర్స్ విమానంలో ఢిల్లీకి చేరనున్నయి

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: