ఇప్పటివరకు విమాన ప్రమాద ఘటనలో చాలా మంది ప్రముఖులు ప్రాణాలు విడిచారు. 1980వ సంవత్సరం జూన్ 23న మాజీ ప్రధానమంత్రి ఇందిరాగాంధీ యొక్క చిన్న కుమారుడు సంజయ్ గాంధీ కూడా హెలికాప్టర్ ప్రమాదంలో మరణించారు. ఢిల్లీ సప్తదార్ జంగ్ విమానాశ్రయంలో హెలికాప్టర్ టేకప్ అయిన కింద కూలిపోయి మరణించారు. అలాగే 1973 వ సంవత్సరం మే 31న కాంగ్రెస్ పార్టీ మాజీ ఎంపీ అయిన మోహన్ కుమార మంగళం విమాన ప్రమాదంలో మృతి చెందారు. ఈ ప్రమాదంలో మృతదేశాలన్నీ చెదిరి పోగా, ఆయనయొక్క పార్కర్ పెన్ను, ఆయన ధరించిన వినికిడి యంత్రం సాయంతో గుర్తించారు. 2001 వ సంవత్సరం సెప్టెంబర్ 30వ తేదీన మాజీ కేంద్రమంత్రి మాధవ్ రావ్ సింధియా ఉత్తరప్రదేశ్లోని కాన్పూర్ బహిరంగసభలో మాట్లాడేందుకు వెళుతుండగా ఈ ప్రమాదం సంభవించింది. 2001 సంవత్సరంలో అరుణాచల్ ప్రదేశ్ మాజీ విద్యాశాఖ మంత్రి డేరా నాథుండు హెలికాప్టర్ ప్రమాదంలో మరణించారు.
2004 సంవత్సరంలో మేఘాలయ మంత్రి సగ్మా, ఆయనతో పాటుగా ముగ్గురు ఎమ్మెల్యేలు మరణించారు. 2002వ సంవత్సరం మార్చి 3వ తేదీన లోక్సభ మాజీ స్పీకర్ బాలయోగి హెలికాప్టర్ ప్రమాదంలో భీమవరం నుంచి తిరిగి వస్తుండగా చెరువులో హెలికాప్టర్ కూలిపోయి మరణించారు. 2004 వ సంవత్సరం ఏప్రిల్ 17వ తేదీన ప్రముఖ సినీ నటి సౌందర్య బెంగళూరులోని జక్కురు విమానాశ్రయం పక్కన కుప్ప కూలింది. దీంతో అక్కడే సజీవదహనం కూడా అయిపోయింది. 2005వ సంవత్సరం మార్చి 31 వ తేదీన జిందాల్ స్టీల్స్ అధినేత ఓం ప్రకాశ్ జిందాల్ హెలికాప్టర్ ప్రమాదంలో మృతి చెందారు. యూపీ లేని సహరాన్పూర్ లో హెలికాప్టర్ కుప్పకూలింది. 2009వ సంవత్సరం సెప్టెంబర్ 3వ తేదీన ఏపీ రాజశేఖర్ రెడ్డి నల్లమల ఫారెస్ట్ లోని పావురాల గుట్ట వద్ద హెలికాప్టర్ ప్రమాదంలో మరణించారు ఆయనతోపాటు ఇంకా అయిదు గురు కూడా చనిపోయారు. 2011 వ సంవత్సరం అరుణాచల్ ప్రదేశ్ సీఎం దోర్జిఖండ్ హెలికాప్టర్ ప్రమాదంలో మరణించారు. ప్రతికూల వాతావరణం కారణంగా లోబో తాండ వద్ద. కుప్పకూలింది. 1945వ సంవత్సరం ఆగస్టు 18వ తేదీన సుభాష్ చంద్రబోస్ తైవాన్ విమాన ప్రమాదంలో చనిపోయారని చెబుతారు.