టీడీపీ కంచుకోటల్లో వైసీపీకి ఫస్ట్ ఛాన్స్ వస్తుందా?

M N Amaleswara rao
రాష్ట్రంలో వైసీపీకి ఉన్న బలం గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన పని లేదు...రాష్ట్రంలో ఉన్న ప్రతి జిల్లాపై వైసీపీకి పట్టు ఉంది. అసలు ఇంకా చెప్పాలంటే వైసీపీ ఇప్పుడు ఏపీలో అత్యంత శక్తివంతమైన రాజకీయ పార్టీ. అయితే ఇంత శక్తిగల వైసీపీకి ఇంకా కొన్ని చోట్ల గెలిచే ఛాన్స్ రాలేదు. వైసీపీ ఆవిర్భావించక...ఆ పార్టీ కొన్ని నియోజకవర్గాల్లో ఇంకా గెలవలేదు. పలు నియోజకవర్గాల్లో ఇంతవరకు వైసీపీ జెండా ఎగరలేదు.
వచ్చే ఎన్నికల్లో ఆ స్థానాల్లో వైసీపీ జెండా ఎగరవేయాలని వైసీపీ నేతలు ఉవ్విళ్లూరుతున్నారు. టీడీపీ కంచుకోటలుగా ఉన్న నియోజకవర్గాల్లో సత్తా చాటాలని చూస్తున్నారు. అయితే ఇంతవరకు వైసీపీ గెలవని నియోజకవర్గాలు కొన్ని ఉన్నాయి. గత ఎన్నికల్లో వైసీపీ 151 సీట్లు గెలుచుకున్న విషయం తెలిసిందే...అంటే ఇంకా 24 సీట్లలో వైసీపీ సత్తా చాటలేకపోయింది...అయితే ఆ సీట్లలో వైసీపీ 2014 ఎన్నికల్లో గెలిచిన సీట్లు కొన్ని ఉన్నాయి. అవి మినహాయిస్తే మిగిలిన సీట్లలో వైసీపీ ఇంతవరకు గెలవలేదనే చెప్పాలి.
అలా వైసీపీ ఇంతవరకు గెలవని నియోజకవర్గాలు వచ్చి.. కుప్పం, హిందూపురం, పర్చూరు, కొండపి, చీరాల, రేపల్లె, గుంటూరు వెస్ట్, గన్నవరం, విజయవాడ ఈస్ట్, ఉండి, పాలకొల్లు, మండపేట, రాజమండ్రి రూరల్, సిటీ, పెద్దాపురం, విశాఖ నార్త్, సౌత్, ఈస్ట్, వెస్ట్, ఇచ్చాపురం, టెక్కలి, రాజోలు సీట్లు.

 
ఈ నియోజకవర్గాల్లో వైసీపీ ఇంతవరకు గెలవలేదు. అయితే వచ్చే ఎన్నికల్లో కొన్ని చోట్ల వైసీపీకి గెలిచే అవకాశాలు దక్కాయని చెప్పొచ్చు. ముఖ్యంగా టీడీపీ నుంచి గెలిచి..వైసీపీలోకి వచ్చిన నలుగురు ఎమ్మెల్యేలు ప్రాతినిధ్యం వహిస్తున్న..చీరాల, గన్నవరం, విశాఖ సౌత్, గుంటూరు వెస్ట్‌ల్లో పార్టీకి పట్టు దొరికింది. అయితే ఇందులో గుంటూరు వెస్ట్‌లో మళ్ళీ వైసీపీ గెలుపు కష్టమే. ఇక టీడీపీ ఎమ్మెల్యేలు ఉన్న సీట్లలో వైసీపీకి గెలిచే ఛాన్స్ ఉన్నాయి వచ్చి...రేపల్లె, విజయవాడ ఈస్ట్, ఉండి, పెద్దాపురం, విశాఖ నార్త్, వెస్ట్, ఇచ్చాపురం సీట్లు. మరి చూడాలి టీడీపీ కంచుకోటల్లో వైసీపీ ఏ మేర సత్తా చాటుతుందో.  

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: