శ్రీకాకుళం జిల్లా వ్యాప్తంగా మొదలైన వర్షం

N ANJANEYULU
బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం తుపానుగా మారిన‌ది. విశాఖకు ఆగ్నేయంగా 420 కి.మీల దూరంలో.. ఒడిశా గోపాల్ పార్కు 530 కిలోమీట‌ర్ల‌ దూరంలో జొవాద్ తుపాను కేంద్రీకృతమైన‌ది. పశ్చిమ వాయువ్య దిశగా ఇది క‌దులుతూ ఉంది.  గంటకు 25 కి.మీల వేగంతో తీరం వైపు కదులుతున్న‌ద‌ని వాతావరణ శాఖ వెల్ల‌డించింది. శనివారం ఉదయానికి ఉత్తర కోస్తాంధ్రకు దగ్గరగా వచ్చే అవకాశం ఉన్నట్టు వెల్ల‌డించింది.  తీరానికి దగ్గరయ్యే కొద్దీ గాలుల తీవ్రత పెరగనున్న‌ది..  కొద్దీ దిశ మార్చుకొని పూరీ వైపు వెళ్లే అవకాశం ఉన్నట్టు అధికారులు అంచెనా వేస్తున్నారు. ఉత్తర కోస్తా తీరంలో 80 నుంచి 90 కి.మీల వేగంతో ఈదురు గాలులు వీచే అవకాశం ఉన్న‌దని హెచ్చరిస్తున్నారు.
శ్రీ‌కాకుళం జిల్లా వ్యాప్తంగా వ‌ర్షం మొద‌లైంది. 192 కిలోమీట‌ర్ల స‌ముద్ర తీర ప్రాంతంలో ఉవ్వెత్తున ఎగిసిప‌డుతున్నాయి అల‌లు. మ‌త్య్స‌కారుల‌ను సుర‌క్షిత ప్రాంతాల‌కు వెళ్లాల‌ని యంత్రాంగం విజ్ఞ‌ప్తి చేసింది. ఇక ఒడిశాలో  మొద‌లైన భారీ వ‌ర్షాల మూలంగా నాగావ‌ళి, వంశ‌ధార‌కు వ‌ర‌ద ముంపు ప్ర‌మాదం పొంచి ఉంది. ముందు జాగ్ర‌త్త చ‌ర్య‌ల‌లో భాగంగా మ‌డ్డువ‌ల‌న‌, గొట్టాబ్యారేజ్ వ‌ద్ద స్టోరేజ్ చేసిన నీటిని  ఇరిగేష‌న్ వ‌దిలారు.  జిల్లాకు వ‌చ్చిన మూడు ఎన్‌డీఆర్ఎఫ్ బృందాలు రాష్ట్ర విప‌త్తుల బృందం ఒక‌టిరాక 1000 వ‌ర‌కు విద్యుత్ స్థంబాల‌ను రెడీ చేసుకుంది విద్యుత్ శాఖ‌. అదేవిధంగా జాతీయ రహదారిపై రాకపోకలకు ఇబ్బందులు లేకుండా క్రేన్స్ ఏర్పాటు చేసినది యంత్రాంగం.
ఇప్ప‌టికే జొవాద్ తుఫాన్ ఎఫెక్ట్ కార‌ణంగా ఉత్త‌రాంద్ర‌కు పెనుముప్పు ఉంటుంద‌నే కార‌ణంతో శ్రీ‌కాకుళం, విజ‌య‌న‌గ‌రం జిల్లాల‌లో స్కూళ్ల‌కు సెల‌వుల‌ను ప్ర‌క‌టించారు. అయితే విశాఖ‌లో మాత్రం విద్యార్థులు స్కూల్‌కు వెళ్లాక సందేశాలు పంపించారు.  శుక్ర‌వారం మ‌ధ్యాహ్నం నుంచి  శ‌నివారం సాయంత్రం వ‌ర‌కు సెల‌వు ప్ర‌క‌టించారు.  అదేవిధంగా శ్రీ‌కాకుళం జిల్లాలో కంట్రోల్ రూమ్ 24 గంట‌ల సేవ‌ల‌ను క‌లెక్ట‌ర్ శ్రీ‌కేష్ ఏర్పాటు చేసారు. క‌లెక్ట‌ర్ కార్యాల‌యంలో జిల్లా కంట్రోల్ రూమ్ 08942240557 స‌ముద్ర తీర ప్రాంతాల‌కు సంబంధించిన మెరైన్ టోల్ ప్రీ 1093, సోంపేట, కంట్రోల్ రూమ్ 9550967001 పాల‌కొండ ఆర్డీఓ కార్యాల‌యం కంట్రోల్ రూమ్ 08941260144 ఎచ్చెర్ల ఆర్డీఓ కార్యాల‌యం కంట్రోల్ రూమ్ 08945245188 ఏర్పాటు చేసారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: