అమ‌రావ‌తిపై కేంద్రం తెర వెన‌క షాకింగ్ ప్లాన్‌..!

VUYYURU SUBHASH
కేంద్రంలోని బీజేపీ అనుస‌రిస్తున్న వైఖ‌రిపై వైసీపీలో ఆస‌క్తిక‌ర చ‌ర్చ సాగుతోంది. ``కేంద్రంలోని బీజేపీకి మ‌నం చేదోడు వాదోడుగా ఉన్నాం. అనేక బిల్లుల‌కు కూడా మ‌ద్ద‌తు ప్ర‌క‌టించాం. అయితే.. మ‌న డిమాండ్లు ఒక్క‌టికూడా నెర‌వేర్చే ప‌రిస్థితి లేకుండా పోయింది!`` అని వైసీపీ నాయ‌కులు బాహాటంగానే అంటున్నారు. అయితే.. కొంద‌రు మాత్రం కేంద్రంలోని బీజేపీ ఒక విష‌యంలో మ‌న‌కు స‌హ‌క‌రిస్తోంద‌ని అంటున్నారు. అదే శాస‌న మండ‌లి. గ‌తంలో మూడు రాజ‌ధానులు. సీఆర్ డీయే ర‌ద్దు వంటివి చేసిన‌ప్పుడు మండ‌లిలో టీడీపీ తీవ్రంగా వ్య‌తిరేకించింది. దీంతో సీఎం జ‌గ‌న్ అస‌లు మండ‌లే వ‌ద్దని తీర్మానం చేశారు.

ప్ర‌స్తుతం ఈ తీర్మానం కేంద్రం వ‌ద్ద పెండింగులో ఉంది. అయితే.. దీనిని ఆమోదించే విష‌యంలో జ‌గ‌న్ పై ఉన్న సానుకూల‌త నేప‌థ్యంలో కేంద్రం వెనుక‌డుగు వేస్తోంది. సో.. దీంతో వైసీపీలోని కీల‌క నేత‌ల‌కు జ‌గ‌న్‌.. మండ‌లిలో చోటు క‌ల్పిస్తున్నారు. దీనివ‌ల్ల ప‌ద‌వుల వ్య‌వ‌హారం జ‌గ‌న్ త‌ల‌నొప్పులను త‌గ్గించింది. ఈ విష‌యంలో వైసీపీ నాయ‌కులు కేంద్రంపై సానుకూలంగానే ఉన్నారు. కానీ.. ఎటొచ్చీ.. వైసీపీ స‌ర్కారుకు అత్యంత కీల‌కంగా మారిన మూడు రాజ‌ధానుల అంశంపైనే కేంద్రం అనుస‌రిస్తున్న విధానం వివాదంగా మారింది . ప్ర‌స్తుతం ఇది. హైకోర్టు విచార‌ణ‌లో ఉంది. ప్ర‌స్తుతం రోజువారీ విచార‌ణ జ‌రుగుతోంది.

ఇక‌, ఇప్ప‌టికే కేంద్రం కూడా రాష్ట్ర రాజ‌ధాని అంశం ఆయా రాష్ట్ర ప్ర‌భుత్వ ప‌రిధిలోదేన‌ని స్పంష్టం చేసింది. దీంతో కొన్నాళ్లుగా జ‌గ‌న్ స‌ర్కారు ఆశ‌తో నే ఉంది. అయితే.. ఇటీవ‌ల బీజేపీ అగ్ర‌నేత‌.. అమిత్ షా తిరుప‌తి ప‌ర్య‌ట‌న‌కు వ‌చ్చిన తర్వాత‌.. వ్యూహం మారిపోయింది. అమ‌రావ‌తి రైతులు చేస్తున్న పాద‌యాత్ర కు మ‌ద్ద‌తివ్వాలంటూ..లోక‌ల్ నేత‌ల‌ను ఆయ‌న ఆదేశించారు. దీంతో ఇప్పుటు నాయ‌కులు క‌ట్ట‌గ‌ట్టుకుని పాద‌యాత్ర‌లో పాల్గొంటున్నారు. అంటే.. దీనిని బ‌ట్టి అమ‌రావ‌తిపై కేంద్రం యూట‌ర్న్ తీసుకుందా? అనే చ‌ర్చ వైసీపీలో సాగుతోంది. ఇదే క‌నుక నిజ‌మైతే.. రేపు మ‌ళ్లీ హైకోర్టు కేంద్రాన్ని అభిప్రాయం కోరితే.. ఏం చెబుతారు? అని నాయ‌కులు చ‌ర్చించు కుంటున్నారు.

ఒక‌వేళ‌.. తాము అమ‌రావ‌తికి ఓకే అంటూ.. ప్ర‌తిపాద‌న చేస్తే.. ఇప్ప‌టి వ‌ర‌కు తీసుకున్న స్టాండ్ నీరుగారి పోవ‌డం ఖాయ‌మ‌ని వైసీపీ నాయ‌కులు భావిస్తున్నారు. ఈ నేప‌థ్యంలోనే మండ‌లి విష‌యంలో బాగానే ఉన్నా.. రాజ‌ధాని విష‌యంలో బీజేపీని న‌మ్మే ప‌రిస్థితి లేద‌ని అంటున్నారు. దీని ప్ర‌కారం రేపు సెంటిమెంటుగా మారితే.. బీజేపీ విష‌యంలో ఏం చేయాల‌నే విష‌యంలో వారు త‌ర్జ‌న భ‌ర్జ‌న ప‌డుతున్నారు. మ‌రి .. ఈ విష‌యంలోజ‌గ‌న్ ఎలా ముందుకు వెళ్తార‌నేది ఆస‌క్తిగా మారింది. చూడాలి ఏం జ‌రుగుతుందో అంటున్నారు నాయ‌కులు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: