భారత్ మరో ముందడుగు.. తైవాన్ తో కలిసి?

praveen
సరిహద్దుల్లో చైనాతో ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో భారత ప్రభుత్వం మేక్ ఇన్ ఇండియా నినాదాన్ని తెర మీదికి తెచ్చింది అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే మేకిన్ ఇండియా నినాదం లో భాగంగా ప్రతి ఒక్క వస్తువు కూడా ఇండియాలోనే తయారు చేసే దిశగా అడుగులు వేస్తోంది. ఈ క్రమంలోనే దౌత్య పరంగా కూడా ఎంతో వ్యూహాత్మకంగా ముందుకు సాగుతుంది భారత ప్రభుత్వం. వివిధ దేశాలతో సత్సంబంధాలు కుదుర్చుకుంటుంది. ఈ క్రమంలోనే వివిధ రకాల వాణిజ్య పరమైన ఒప్పందాలను కూడా చేసుకుంటుంది భారత్.

 ఇలా మేకిన్ ఇండియా లో భాగంగా విదేశీ కంపెనీలను భారత్లోకి ఆకర్షించడంలో విజయవంతం అవుతుంది అని చెప్పాలి. విదేశీ కంపెనీలకు భారత్లో అన్ని రకాల అనువైన పరిస్థితులు కల్పించి ఇక్కడే పూర్తిగా ఉత్పత్తి ప్రారంభించే విధంగా భారత్ దౌత్య పరంగా ఎంతో వ్యూహాత్మకంగా అడుగులు వేస్తుంది. ఇలా ఇప్పటికే ఆయుధాలు తయారు సహా మరికొన్ని రకాల కంపెనీలు కూడా భారత్లోకి ఆహ్వానించింది. ఇక ఇప్పుడు  మరో కీలక ముందడుగు వేయడానికి సిద్ధమైంది భారత్. ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా చిప్ కొరత ఎంతగానో వేధిస్తోంది.

 చిప్ లు ఎక్కువగా తైవాన్లో తయారు చేస్తూ ఉంటారు అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే కరోనా వైరస్ కారణంగా తైవాన్ లో మానవ వనరుల కొరత ఏర్పడి చిప్ తయారీ కాస్త నిలిచిపోయింది. ఈ క్రమంలోనే ఇక ఇదే సమయాన్ని తమకు అనుకూలంగా మార్చుకోవాలని భావిస్తుంది భారత్. భారత్లో ప్రస్తుతం మానవ వనరులతో పాటు అన్ని రకాల అనుకూలమైన పరిస్థితులు ఉన్నాయని.. ఇక తైవాన్కు చెందిన కంపెనీలు నిపుణులు వచ్చి భారత్లో కంపెనీలు  ప్రారంభించు కోవాలి అంటూ అంటూ తైవాన్ ముందు ఒక ప్రతిపాదన తెచ్చినట్లు తెలుస్తోంది. భారత్లో జాయింట్ వెంచర్ రూపంలో చిప్ తయారీని ప్రారంభిస్తే బాగుంటుందని ప్రతిపాదన తెరమీదకు తీసుకు రాగా  దీనిపై తైవామ్ ఎలా స్పందిస్తుంది అన్నది ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారిపోయింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: