కేసీఆర్ ఆ కారణంతోనే తుమ్మలను పక్కన పెట్టారా ?
పాలేరు నియోజకవర్గం లోని తిరుమలాయ పాలెం మండలానికి చెందిన మధు ఎన్నారై . ఇక తుమ్మలకు ఎమ్మెల్సీ ఇస్తారని ముందు నుంచే ప్రచారం జరిగినా కేసీఆర్ ఆయన ఎందుకు పక్కన పెట్టారు అనే దానిపై ఆసక్తికర చర్చలు జరుగుతున్నాయి. అయితే ఎమ్మెల్సీ తీసుకునేందుకు తుమ్మలే స్వయంగా ఒప్పుకోలేదని తెలుస్తోంది. 2018 ముందస్తు ఎన్నికల్లో పాలేరు నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉండి తుమ్మల ఓడిపోయారు.
ఈ క్రమంలోనే వచ్చే ఎన్నికల్లో తాను మరోసారి ఎమ్మెల్యేగా పోటీ చేస్తానని... తనకు ఎమ్మెల్సీ వద్దని స్వయంగా కెసిఆర్ కు చెప్పారని తెలుస్తోంది. ఈ క్రమంలోనే ఆయన మళ్లీ అసెంబ్లీకి వెళ్లేందుకు ఆసక్తి చూపుతున్నారట. అందుకే ఎమ్మెల్సీ పదవిని ఆయన తిరస్కరించినట్టు తెలుస్తోంది. గత ఎన్నికల్లో తుమ్మల పై గెలిచిన కందాళ ఉపేందర్ రెడ్డి ఆ తర్వాత టీఆర్ ఎస్ గూటికి చేరుకున్నారు.
అప్పటి నుంచి పార్టీలో తుమ్మల ప్రాధాన్యత తగ్గినట్టు కనిపించినా కేసీఆర్ తో ఉన్న అనుబంధంతో ఆయన ఎప్పుడూ పరిధి దాటలేదు. ఇక వచ్చే ఎన్నికల్లో పాలేరులో టీఆర్ ఎస్ గెలవాలంటే తుమ్మలే పోటీ చేయాలని అధిష్టానం దృష్టికి వెళ్లింది. ఇక తుమ్మల కూడా అసెంబ్లీ మోజు మీదే ఉండడంతో ఆయనకు ఈ సారి ఎమ్మెల్సీ దక్కలేదు