ఎస్ 400 వచ్చేస్తోంది.. శత్రు దేశాల్లో వణుకు?
అదే సమయంలో విదేశాల నుంచి అధునాతన టెక్నాలజీతో కూడిన ఆయుధాలను కూడా కొనుగోలు చేస్తూ భారత త్రివిధ దళాలను కూడా అంతకంతకూ పటిష్టంగా మారుస్తూ ఉండటం గమనార్హం. ఇక ఇటీవల కాలంలో ఎన్నో నూతన టెక్నాలజీతో కూడిన ఆయుధాలు క్షిపణులను కూడా భారత అమ్ముల పొదిలో వచ్చి చేరిపోయాయి. అయితే ఇటీవలే ఎస్-400 క్షిపణి భారత అమ్ములపొదిలో చేరబోతోంది. గత కొన్ని రోజుల నుంచి దీనికి సంబంధించిన చర్చ జరుగుతోంది. దీని స్పెషాలిటీ ఏంటి అంటే.. ప్రపంచంలోనే ఏ యుద్ధ విమానాన్ని అయినా సరే ఎంతో సులభంగా కూల్చి వేయగల అత్యంత అధునాతనమైన క్షిపణి వ్యవస్థ ఇది.
అయితే అమెరికాకు చెందిన అటువంటి అత్యంత శక్తివంతమైన యుద్ధం ఎఫ్ 30 యుద్ధ విమానాన్ని కూడా ఈ క్షిపణి వ్యవస్థ నాశనం చేయగలదు అంటూ చెబుతున్నారు శాస్త్రవేత్తలు. ఇక ఈ క్షిపణి వ్యవస్థ ఏకంగా ఒకేసారి 72 క్షిపణులను ప్రయోగించే కలిగి ఉందట. అంతేకాదు ఏకకాలంలో 36 అణు సామర్థ్యం గల క్షిపణులను కూడా నాశనం చేయగలదట ఈ క్షిపణి వ్యవస్థ. అమెరికా రష్యా చైనాల తర్వాత 400 కిలోమీటర్ల పరిధిలో ఎస్-400 క్షిపణి వ్యవస్థను కలిగి ఉన్న నాలుగవ దేశంగా భారతదేశం నిలిచింది. అయితే ఈ ఏడాది చివరి నాటికి s400 క్షిపణి వ్యవస్థ భారత అమ్ములపొదిలో చేయబోతోందట. ఇలా భారత ఆర్మీ మరింత పటిష్టంగా మారిపోయింది అని అంటున్నారు విశ్లేషకులు.