వామ్మో.. అమెజాన్ లో గంజాయి అమ్మకాలు?

praveen
ఇటీవలి కాలంలో ఆన్లైన్ ప్రపంచం నడుస్తోంది. ఆన్ లైన్ మీద ఆధారపడిన వారి సంఖ్య కూడా రోజురోజుకూ పెరిగిపోతోంది. ఒకప్పుడైతే ఏదైనా వస్తువు కావాలి అంటే ఇంటి నుంచి బయటకు వెళ్లి షాప్ లో కొనుగోలు చేసేవారు. కానీ ఇప్పుడు అంత కష్టపడాల్సిన పని లేకుండా పోయింది. ఎందుకంటే అర చేతిలో ఉన్న స్మార్ట్ ఫోన్ లో ఒక్క క్లిక్ చేస్తే చాలు మనకు కావాల్సిన వస్తువులు వచ్చి ఇంటి ముంగిట వాలిపోతున్నాయి. ఇలా ఇటీవలి కాలంలో ఎన్నో రకాల ఈ కామర్స్ సంస్థలు తమ వినియోగదారులందరికీ నాణ్యమైన సర్వీసులు అందిస్తున్నాయి. అన్ని  రకాల వస్తువులను కూడా ఇంటివద్దకే డెలివరీ చేస్తూ ఉండటం గమనార్హం.


 ఈ క్రమంలోనే ప్రతి ఒక్కరూ తమకు కావాల్సిన అన్ని వస్తువులను కూడా ఆన్లైన్లో ఆర్డర్ చేయడం ఒక ఇంటి వద్దనే డెలివరీ తీసుకోవడం లాంటివి చేస్తూ ఉన్నారు. అయితే ఆన్లైన్లో ఇప్పటివరకు ఏం దొరుకుతాయో అన్నది అందరికీ క్లారిటీ ఉంది. కానీ ప్రభుత్వం నిషేధించిన మాదక ద్రవ్యాలు లాంటివి ఆన్లైన్ లో దొరుకుతాయి అంటే ఎవరైనా నమ్ముతారా.. ముఖ్యంగా గంజాయి లాంటివి ఆన్లైన్లో దొరకడం అంటే అందరినీ షాక్ కి గురి చేస్తూ ఉంటుంది. ఇక ఇటీవలే ఆన్లైన్ లో ఇలాంటి ఒక స్మగ్లింగ్ రాకెట్ దుకాణం పెట్టేసింది.


 స్వీట్ నర్ పేరిట ఆన్లైన్ లో జరుగుతున్న గంజాయి స్మగ్లింగ్ రాకెట్ను ఇటీవలే మధ్యప్రదేశ్ పోలీసులు ఛేదించారు. అంతేకాదు ఇక ఇలా గంజాయి అమ్మకాలకు సహకరించిన అమెజాన్ సంస్థ పై కూడా నమోదు చేశారు పోలీసులు. ఏ ఎన్ ఎస్ ఎల్ పేరిట ఈ కామర్స్ వ్యాపారం చేస్తున్న అమెజాన్ ఇండియా ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ పై నార్కోటిక్ డ్రగ్స్ అధికారులు చట్టంలోని సెక్షన్ 38 కింద కేసు నమోదు చేసినట్లు తెలిపారు. ఈనెల 13వ తేదీన ఇద్దరు దగ్గర  నుంచి 21.7 కిలోల గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకోవడం గమనార్హం. ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నం నుంచి అమెజాన్ ద్వారా సరుకులు తెప్పించి అమ్మకాలు జరుపుతున్నట్లు  పోలీసులు గుర్తించారు. అయితే మరోసారి ఇలాంటి పొరపాటు జరగదు అంటూ అమెజాన్ సంస్థ వివరణ ఇచ్చింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: