ప్రియురాలితో శృంగారం కూడా అత్యాచారమే : హైకోర్టు

praveen
ఇటీవలి కాలంలో మహిళల రక్షణ రోజురోజుకు ప్రశ్నార్థకంగా మారిపోతోంది అన్న విషయం తెలిసిందే  ఎంతో మంది కామాంధులు మహిళలు కనిపిస్తే చాలు మానవ మృగాలు లాగా మారిపోయి దారుణ అత్యాచారాలకు పాల్పడుతున్నారు. అయితే కామంతో కళ్లు మూసుకుపోయిన వారు ఎవరో తెలియని మహిళలపై అత్యాచారాలకు పాల్పడుతున్న వారు  కొంతమంది అయితే.. ఇంకొంతమంది ప్రేమ పేరుతో ముసుగు వేసుకుని మహిళలపై బలవంతంగా అత్యాచారాలకు పాల్పడుతున్న ఘటనలు కూడా వెలుగులోకి వస్తున్నాయి.



 ప్రేమిస్తున్నాను నువ్వు లేకుండా బ్రతకలేను అంటూ మాయ మాటలు చెప్పడం ఇక ఆ తర్వాత లైంగికంగా దాడి చేయడానికి ప్రయత్నించడం లాంటివి చేస్తూ ఉన్నారు. ఇక ఎదురు చెబితే ఆమాత్రం లైంగిక సంబంధం పెట్టుకోలేవా అంటూ బెదిరించడం లాంటివి కూడా చేస్తున్నారు.. అయితే ఇలాంటివి ఇప్పటినుంచి చెల్లవు అని చెప్పాలి.. ఎందుకంటే ఇదే విషయంపై కేరళ హైకోర్టు ఒక సంచలన తీర్పును వెలువరించింది. మహిళా ఒక వ్యక్తిని ప్రేమించినంత మాత్రాన అతడితో లైంగిక సంబంధం పెట్టుకోవడానికి మహిళ అంగీకరించినట్లు కాదు అన్న విషయాన్ని కేరళ హైకోర్టు స్పష్టం చేసింది.

 అంతేకాదు ప్రేమకు అంగీకరిస్తే లైంగిక సంబంధానికి కూడా మహిళ అంగీకరించింది అని అనుకోవడం కూడా సరి కాదు అంటూ తెలిపింది. ఒకవేళ ప్రేమించిన యువతిని బలవంతపెట్టి లైంగిక సంబంధం పెట్టుకుంటే అది అపహరణ తో పాటు అత్యాచారం కిందకే వస్తుందని హైకోర్టు న్యాయమూర్తి తెలిపారు. నిస్సహాయ స్థితిలో గత్యంతరం లేని పరిస్థితుల్లో ఒక యువతి ప్రేమించిన వ్యక్తితో లైంగిక సంబంధం లో పాల్గొంటే అది అంగీకారం కిందికి రాదని అత్యాచారం కిందికి వస్తుంది అంటూ తెలిపింది కోర్టు. అంగీకారానికి, లొంగుబాటు కు ఎంతో తేడా ఉంది అన్న విషయం స్పష్టం చేసింది. ఇటీవలే శ్యాం శివం అనే యువకుడు తాను ప్రేమించిన మైనర్ బాలికలను బలవంతంగా ఇతర ప్రాంతాలకు తీసుకెళ్లి అత్యాచారం చేశాడు. లేదంటే చనిపోతాను అంటూ బెదిరింపులకు పాల్పడ్డాడు. అయితే కోర్టులో మాత్రం ఇష్టానుసారంగా అనే యువతి తనతో సంబంధం పెట్టుకుంది అంటూ యువకుడు వాదించాడు. యువకుడి వాదనను కొట్టివేసిన కోర్టు అత్యాచారం నేరం కింద శిక్ష విధించింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: