టీఆర్‌ఎస్ పార్టీ ధర్నా పై బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ సంచలన వ్యాక్యలు చేశారు. గత 45 రోజులుగా వరి దాన్యం రోడ్ల మీద ఉంది.. రైతుల కన్నీళ్లు పెట్టుకుంటున్నారు... వరి కుప్పల మీదనే ప్రాణాలు వదులుతున్నారన్నారు. సీఎం నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తూ... సిగ్గు లేకుండా బాధ్యత లు మర్చి పోయి... గాలికి వదిలేసి .. ధర్నా చౌక్ వద్దు అన్న చోటనే .. తన రాజకీయ శక్తిని కూడగట్టుకొని తన అశక్తి ని కేంద్రం పై మోపే ప్రయత్నం చేసాడని ఆగ్రహం వ్యక్తం చేశారు ఈటల రాజేందర్. అత్యంత జుగుప్స కరంగా మాట్లాడారని... నాకే అన్ని తెలుసు అనే అహంకారం తో చేస్తున్న పనుల వల్ల రైతాంగ మ్ ఇబ్బంది పడుతుంది...పూర్తి బాధ్యత కేసీఆర్ వహించాలని డిమాండ్ చేశారు ఈటల రాజేందర్.
నిండు అసెంబ్లీ సాక్షిగా ప్రతి గింజ నేనే కొంటున్న అని పోజులు కొట్టారని... ఏది కేసీఆర్ ది కాదని ఇప్పుడు అందరికి అర్థం అయింది... తన కీర్తి కోసం తప్ప ఆయన ప్రజల గురించీ ఎప్పుడు పట్టించుకోడని నిప్పులు చెరిగారు. సీఎం అనాలోచిత నిర్ణయాల వల్ల కూరగాయలు కూడా దిగుమతి చేసుకోవాల్సిన పరిస్థితి అని... మోడరన్ టెక్నాలజీ రైస్ మిల్స్ ఏర్పాటు కు సహకిస్తామని సీఎం గతం లో చెప్పారు.. కానీ చేయలేదని తెలిపారు. ఆయన ముందు చూపు లేకపోవడం తోనే ఈ దుస్థితి అని... కేసీఆర్ ఇంత అబద్ధాల కోరా అని ప్రజలు అంటున్నారన్నారు. కోటి టన్నుల ధాన్యాన్ని మిల్లింగ్ చేసే ఏర్పాటు ఎందుకు చేయలేదు.. సోయి లేదా కేసీఆర్ అని చురకలు అంటించారు. వరి వేస్తే ఉరి అని ఎలా మాట్లాడుతావని.. వాన కాలం పంట కొంటామని చెప్పిన డ్రామా లు అడుతున్నాడని ఫైర్ అయ్యారు బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్.