అమెరికన్లలో తగ్గుతున్న సెక్స్ కోరికలు.. సర్వేలో ఆసక్తికర నిజాలు?
ఇక ఇటీవలే అగ్రరాజ్యమైన అమెరికా లో శాస్త్రవేత్తలు నిర్వహించిన ఒక అధ్యయనంలో ఆసక్తికర విషయం బయట పడింది. అమెరికన్లలో రోజురోజుకీ సెక్స్ కోరికలు తగ్గిపోతున్నాయి అన్న విషయం ఈ అధ్యయన నివేదిక వెల్లడిస్తోంది. ముఖ్యంగా సాధారణంగా సెక్స్ లో పాల్గొన్న వారిలో 30 శాతం మంది కనీసం ఒక సంవత్సరం అటు శృంగారానికి దూరంగా నే ఉన్నారని నివేదికలో వెల్లడయ్యింది. నేషనల్ సర్వే ఫ్యామిలీ గ్రోత్ సంస్థ ఈ సర్వే నిర్వహించింది. అమెరికాలో ఉన్న యువతకు రానురాను శృంగారం పట్ల పూర్తిగా ఆసక్తి తగ్గిపోతుంది అన్న విషయం వెల్లడైందని శాస్త్రవేత్తలు తెలిపారు.
పెళ్లి చేసుకుని భాగస్వామితో జీవిస్తున్నప్పటికి కూడా శృంగారంపై ఏమాత్రం ఆసక్తి చూపించడం లేదట. ఇక ఈ నివేదిక ప్రకారం ఇలా జీవిస్తున్న వారి లోనే సెక్స్ కోరికలు తక్కువగా ఉన్నాయి అన్న విషయం తేలింది అని చెప్పుకొచ్చారు. దాదాపు ఐదు శాతానికి పైగా మంది ఏడాది పాటు సెక్స్ కి దూరంగానే ఉన్నారు అన్న ఈ విషయాన్ని ఈ సర్వేలో భాగంగా తెలిపారట. అంతేకాదు ప్రస్తుతం లివ్ ఇన్ రిలేషన్ షిప్ లో ఉన్న యువత సంఖ్య 40 నుంచి 32 శాతానికి తగ్గిపోయిందని అధ్యయనంలో వెల్లడైంది. అంతేకాదు ఎంతోమందికి ఇక లైఫ్ లో సెటిల్ అయిన తర్వాత ఉద్యోగం చేసుకోవాలని భావిస్తున్నారట.. తద్వారా పెళ్లి ఆలస్యం కావడం వల్ల కూడా సెక్స్ పై ఆసక్తి తగ్గుతుందని ఈ సర్వే చెబుతోంది. ముఖ్యంగా మహిళల్లో అయితే ఇలా సెక్స్ కోరికలు చాలా తగ్గిపోతున్నాయని.. దాదాపు చాలా మంది మహిళలు రెండు లేదా మూడు సంవత్సరాల పాటు సెక్స్ కి దూరంగా ఉన్నారు అన్న విషయాన్ని వెల్లడించినట్లు శాస్త్రవేత్తలు తెలిపారు.