దిశ ఎన్ కౌంటర్.. ప్లాన్ మొత్తం సజ్జనార్ దే?

frame దిశ ఎన్ కౌంటర్.. ప్లాన్ మొత్తం సజ్జనార్ దే?

praveen
హైదరాబాద్ నగరంలో జరిగిన దిశ అత్యాచారం హత్య ఘటన ఎంత సంచలనం సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అమాయకురాలైన వెటర్నిటీ టాక్టర్ పై నలుగురు క్రూరమృగాలు దారుణంగా అత్యాచారం చేయడమే కాదు సజీవదహనం చేయడం  తెలుగు రాష్ట్రాల ని ఒక్క సారిగా ఉలిక్కి పడేలా చేసింది. దిశా కేసులో నిందితులను వెంటనే ఉరి తీసి శిక్ష వేయాలి అంటూ ఇక తెలుగు రాష్ట్రంలో భారీ  గా ప్రజలను నిరసనలు తెలిపారు అనే విషయం తెలిసిందే. ఇక ఇలా ప్రజాగ్రహాలు కొనసాగుతున్న సమయంలోనే అటు సీపీ సజ్జనార్ బృందం దిశ కేసులో నలుగురు నిందితులను ఎన్కౌంటర్ చేయడం కాస్త సంచలనంగా మారిపోయింది.




 ఈ ఎన్ కౌంటర్  దేశవ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారిపోయింది అని చెప్పాలి. అయితే కేసు రీస్ట్రక్చరింగ్ చేస్తున్న సమయంలో ఇక దిశ కేసులో నిందితులు తమ కళ్ళల్లో మట్టి కొట్టి ఆయుధాలతో దాడి చేసేందుకు ప్రయత్నించారని ఈ క్రమంలోనే చేసేదేమీ లేక దిశా నిందితులను ఎన్కౌంటర్ చేయాల్సి వచ్చింది అంటూ పోలీసులు వివరణ ఇచ్చారు. ఈ క్రమంలోనే దిశ ఎన్కౌంటర్ గురించి ప్రస్తుతం సిర్పూర్కర్ కమిటీ విచారణ చేపడుతుంది. ఈ కేసుతో సంబంధం ఉన్న కీలక అధికారులందరినీ కూడా విచారిస్తోంది. ఈ క్రమంలోనే కీలక ప్రశ్నలు అడిగి వివరాలు సేకరిస్తోంది.


కాగా దిశ ఎన్కౌంటర్ మృతుల కుటుంబాల తరపు న్యాయవాది కృష్ణమాచారి ఇటీవలే ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. దిశ కేసు నిందితుల ఎన్కౌంటర్ మొత్తం బూటకం అంటూ వ్యాఖ్యానించారు. ఎన్ కౌంటర్ పై పోలీసులు కట్టు కథ అల్లి అందరినీ మోసం చేసేందుకు ప్రయత్నిస్తున్నారు అంటూ వ్యాఖ్యానించారు ఆయన. ఇక ఈ విషయాన్ని కమిషన్ ముందు వాదించారు. దిశ నిందితుల ఎన్కౌంటర్ పథకం ప్రకారమే జరిగిందని ఈ ప్లాన్ మొత్తం ఒకప్పుడు సి పి గా పనిచేసిన సజ్జనార్ దే అంటూ వ్యాఖ్యానించారు. ఇలా ఎన్ కౌంటర్ లో పాల్గొన్న పోలీసులపై క్రిమినల్ ప్రాసిక్యూషన్ అనుమతించాలని అంతేకాదు ఇక ఎన్కౌంటర్పై సిబిఐ విచారణ కొనసాగించాలని కోరారు ఆ న్యాయవాది.

మరింత సమాచారం తెలుసుకోండి:

Cp

సంబంధిత వార్తలు: