లోకేష్ పప్పు కాదా..అంతా వారి దయే!

M N Amaleswara rao
నారా లోకేష్‌ని ప్రత్యర్ధులు ఏమని పిలుస్తారో చెప్పాల్సిన పని లేదు...ఆయన్ని అంతా పప్పు పప్పు అని పిలిచేవారు...అంటే రాజకీయంగా ఏం మాట్లాడాలో ఏం చేయాలో తెలియదని చెప్పి ఆయన్ని పప్పు అనేవారు. అది కూడా టీడీపీ అధికారంలో ఉండగా లోకేష్ మంత్రిగా ఉన్న సమయంలో అప్పుడు ప్రతిపక్షంలో ఉన్న వైసీపీ నేతలు లోకేష్ టార్గెట్‌గా అలాగే విమర్శించేవారు. విమర్శలకు తగ్గట్టుగానే లోకేష్ రాజకీయం కూడా ఉండేది...లోకేష్‌కు సరిగ్గా మాట్లాడటం వచ్చేది కాదు...పని ఎలా చేస్తున్నారనే విషయం హైలైట్ కాకపోయినా ఇలా తడబాటు మాటలు బాగా హైలైట్ అయ్యాయి..అందుకే అప్పుడు లోకేష్ బాగా నెగిటివ్ అయ్యారు.
అందుకే 2019 ఎన్నికల్లో ఓటమి పాలయ్యారు...కానీ ఈ ఓటమే లోకేష్‌లో బాగా మార్పు తీసుకొచ్చినట్లు కనిపిస్తోంది. అటు పార్టీ కూడా ఘోరంగా ఓడిపోవడంతో లోకేష్ ప్రవర్తనలో చాలా తేడా వచ్చింది...రాజకీయంగా కూడా మార్పులు వచ్చాయి...మాటల్లో తడబాటు తగ్గింది....దూకుడుగా రాజకీయాలు చేయడం...పదునైన పదజాలంతో ప్రత్యర్ధిపై విరుచుకుపడటం చేస్తున్నారు. ఇలా చేయడం వల్ల టీడీపీకి ఎంత లాభం వచ్చిందో తెలియదు గానీ...లోకేష్‌లో అయితే చాలా మార్పు వచ్చిందనే చెప్పొచ్చు.
కాస్త జాగ్రత్తగా గమనిస్తే...గతంలో పప్పు పప్పు అని విమర్శించిన వైసీపీ నేతలే ఇప్పుడు..ఆ పదం వాడటం తగ్గించేశారు. రాజకీయంగా విమర్శలు చేయడం మొదలుపెట్టారు. పూర్తిగా లోకేష్, జగన్ టార్గెట్‌గా తీవ్ర విమర్శలు చేస్తున్నారు. అటు వైసీపీ నుంచి కౌంటర్లు అలాగే వస్తున్నాయి.
తాజాగా కుప్పం ఎన్నికల ప్రచారంలో కూడా లోకేష్ వైసీపీ టార్గెట్‌గా గట్టిగానే విమర్శలు చేశారు. అందుకే లోకేష్ రౌడీలాగా మాట్లాడుతున్నారని వైసీపీ నేతలు ఫైర్ అవుతున్నారు. అంటే పప్పు అనే స్థాయి నుంచి రౌడీ అనేవరకు వచ్చింది..అంటే ఎలా రౌడీయిజం చేస్తున్నారో తెలియదు గానీ...వైసీపీ నేతలు మాత్రం పరోక్షంగా లోకేష్‌ని లేపినట్లే కనిపిస్తోంది. అంటే లోకేష్ రౌడీయిజం చేస్తే వైసీపీ ప్రభుత్వం ఊరుకుంటుందా? అనేది కూడా చూడాలి. మొత్తానికైతే లోకేష్‌ని పూర్తిగా వైసీపీ నేతలే మార్చేశారని చెప్పొచ్చు.  

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: