ఏపీ రాజకీయాలు ఢిల్లీ చుట్టూ తిరుగుతున్నాయని.. ఏపీ మంత్రులు ఢిల్లీ వచ్చి రహస్య మంత్రాంగం నడుపుతున్నారని మండిపడ్డారు టిడిపి రాజ్యసభ సభ్యుడు కనకమేడల రవీంద్ర కుమార్. ఢిల్లీలో ఏం జరుగుతుందో రాష్ట్ర ప్రజలకు ప్రభుత్వం తెలపాలని. ఏపీ ఆర్ధికమంత్రి అప్పుల కోసం ఢిల్లీ వస్తున్నారని ఫైర్ అయ్యారు. ఏపీ పరువు మర్యాదలు కాపాడండి... తెలంగాణను చూసి నేర్చుకోండని చురకలు అంటించారు. రహస్యాలు ఉన్న చోట కుట్రలు మోసాలు ఉంటాయని.. రాష్ట్ర పరిణామాలను బట్టి మంత్రుల పర్యటనల పట్ల అనుమానాలు కలుగుతున్నాయని తెలిపారు.
రాష్ట్ర రాజధాని కోసం 700 రోజులుగా రైతులు ఆందోళన చేస్తున్నారని.. రాజధాని కోసం పాదయాత్ర చేస్తుంటే పోలీసులు అడ్డంకులు సృష్టిస్తున్నారు... అమరావతి రాజధాని కోసం చేస్తున్న పాదయాత్రకు మద్దతు పెరుగుతుంటే రాష్ట్ర ప్రభుత్వం కంగారు పడుతుందని తెలిపారు టిడిపి రాజ్యసభ సభ్యుడు కనకమేడల రవీంద్ర కుమార్. రైతుల పాదయాత్ర ను కొనసాగించలేని ప్రభుత్వం, ఇక పాలన ఎం చేస్తుంది... విద్యా వ్యవస్థకు ఎసరు పెట్టేలా ఎయిడెడ్ కళాశాలలను ప్రభుత్వం లో విలీనం చేస్తున్నారన్నారు. . ఎయిడెడ్ కళాశాలల ఆస్తులను దోచుకుంటున్నారు... విద్యార్థులు అడ్డుపడితే పోలీసులు దాడులు చేస్తున్నారని ఫైర్ అయ్యారు. . ఏపీలో ఫ్యాక్షనిజానికి అధికారం తోడైంది... పాలనలో రాష్ట్ర ప్రభుత్వం వైఫల్యం చెందిందన్నారు.
25 వేల కోట్ల రూపాయలను డిస్కంలకు రాష్ట్ర ప్రభుత్వం చెల్లించాల్సి ఉందని.. అస్తవ్యస్తంగా విద్యుత్ కొనుగోళ్లు ఉన్నాయన్నారు. ఏపీఆర్సి సంస్థను ప్రభుత్వం గుప్పిట్లో పెట్టుకుందని.. విద్యుత్ శాఖ అస్తవ్యస్తంగా తయారైంది..ప్రజలపై అదనపు భారాలు మోపుతున్నారు... ఏపీలో వైద్య రంగం నిర్వీర్యమవుతుందన్నారు. ఏపీ ముఖ్యమంత్రి ఢిల్లీలో అడుక్కుంటున్నారని తెలంగాణ మంత్రి వ్యాఖ్యలు చేస్తున్నారు..నేను వాటిని సమర్ధించడం లేదని.. ఢిల్లీలో ఏపీ పరువు తీస్తున్నారని మండిపడ్డారు. స్థానిక సంస్థల ఎన్నికలు కూడా ప్రశాంతంగా జరిపే పరిస్థితి లేదని ఫైర్ అ య్యా రు.