నెల్లూరోడు : జగనన్న భక్తులకు తిరుగేలేదు రా!
ఇక నెల్లూరు కేంద్రంగా రాజకీయం నడుపుతున్న మంత్రి అనీల్ కుమార్ యాదవ్ అంతా తానై నడిపిస్తున్నారు. అయితే అన్ని వేళల్లోనూ జగన్ కు అనుకూలంగా తీవ్ర స్థాయిలో ఆయన మాట వినిపిస్తున్నా కూడా కొన్ని వ్యాఖ్యలు అధినేతను కూడా ఇబ్బందికి గురి చేస్తున్నాయి. మంత్రి అనీల్ , మరో మంత్రి సీదిరి లాంటి స్పీడున్న లీడర్ల కారణంగా జగన్ ను చాలా చాలా సార్లు వివాదాలు పలకరించాయి. అనీల్ స్పీడును అసెంబ్లీలో విపరీతంగా వాడుకున్న జగన్ తరువాత అదే పంథాలో ఆయనకు బయట మాత్రం మద్దతివ్వలేదు అన్నది ఓ వాస్తవం. అలానే మంత్రి సీదిరికి కూడా! సో.. అసెంబ్లీ వరకూ మాట్లాడేందుకే ఇలాంటి నోటి దురుసు నాయకులను వాడుకుంటారని కూడా కొన్ని సందర్భాల్లో తేలిపోయింది. ఇదే సందర్భంలో అచ్చెన్నను తిట్టేందుకు దువ్వాడను, చంద్రబాబును తిట్టేందుకు కొడాలి నానిని, అదేవిధంగా లోకేశ్ ను తిట్టేందుకు వంశీని ఇలా ఎక్కడికక్కడ నోటి దురుసు నేతలను నియమించి జగన్ రాజకీయం చేస్తున్నా ప్రస్తుతానికి సంబంధిత వ్యూహాలేవీ వికటించలేదు. ఇక తాజా రాజకీయాల్లో కార్పొరేషన్ ఎన్నికలన్నీ వైసీపీకి అనుకూలం అనే తేలిపోయింది. ఇక్కడ అచ్చెన్న, యనమల లాంటి లీడర్లు ప్రచారం చేస్తున్నా ఒడ్డెక్కే ఛాన్స్ అయితే లేదు. సోమిరెడ్డి లాంటి లీడర్లు ఎప్పుడో ఔట్ డేటెడ్ లీడర్లయిపోయారు. టీడీపీకి ఊతం ఇచ్చేందుకు లోకేశ్ సీన్ లోకి వచ్చినా, బాబు వచ్చినా ఉపయోగం లేనేలేదు. సో! నెల్లూరు రెడ్లంతా ప్రస్తుతం జగన్ వైపే.. వారితో పాటు యాదవులు కూడా!