పసుపు ముళ్లు : కుప్పంలో ఓడితే ఏమౌద్ది?
తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడిని అడుగడుగునా నిలువరిస్తున్నారు యువ ముఖ్యమంత్రి జగన్. వయసులో పెద్ద మనిషి కదా పాపం తన దారి తాను ఏంటన్నది వెతుక్కోవాలని ఆశపడుతున్నారు. ఇదివరకు చేసిన విధంగా రాజకీయం చేయడంలో చంద్రబాబు వెనుకబడిపోయారని తెలుస్తోంది. ఇదే విధితం కూడా! కానీ పాపం ఆయన తరహా రాజకీయం చెల్లుబాటు కానుందునే వైసీపీ ఎన్నెన్ని మలుపు తిప్పుతూ తన ఎన్నికల స్టంట్ సాగిస్తోందని? ఇప్పుడిక టీడీపీ ఆటలు చెల్లవు అని తాము అధికారం అనే వెలుగులో ఉన్నాం కనుక తమ మాటే చెల్లుతుందని జగన్ చెప్పకనే చెబుతున్నారు. ఇవి 2024 వరకూ చెల్లుబాటు అయ్యే మాటలు అని తేలిపోయింది. కానీ జగన్ మాత్రం రానున్న 20 ఏళ్లలో కూడా తానే అధికారంలో ఉంటానని చెబుతున్నారు.
ఇక కుప్పంలో తెలుగుదేశం పార్టీ ఓడిపోతే ఏమౌతుంది. గతంలో ఇక్కడ అధికార దుర్వినియోగం చేసిన టీడీపీ తన మార్కు రాజకీయం కొంత కాలం నడిపింది. ఇప్పుడిదే రాజకీయం నడిపేందుకు నెగ్గుకు వచ్చేందుకు 25 /25 (25 వార్డులకూ 25) గెల్చుకునేందుకు ఉవ్విళ్లూరుతోంది. సొంత నియోజకవర్గంలో బాబు గెలవక చతికిలపడ్డారని ప్రచారం చేసి వైసీపీ లాభం పొందాలని యోచిస్తోంది. ఇదే సమయంలో ఎక్కడికక్కడ తెలుగుదేశం అభ్యర్థులను కనీసం నామినేషన్లు వేయకుండా, వేసినా కూడా ప్రచారం చేయనివ్వకుండా అడ్డం పడుతోంది వైసీపీ.