జ‌గ‌న్ దెబ్బ‌తో టాలీవుడ్‌కు ఇన్ని కోట్లు న‌ష్ట‌మా...!

VUYYURU SUBHASH
ఏపీ సీఎం జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి టికెట్ రేట్లు తగ్గించిన వ్యవహారం టాలీవుడ్ కు మాస్టర్ స్ట్రోక్ గా మార‌బోతోంది. ఇప్ప‌టి వ‌ర‌కు కావాల్సిన‌న్ని బెనిఫిట్ షో ల‌తో పాటు ఇష్టం వ‌చ్చిన‌ట్టు టిక్కెట్ రేట్లు పెంచి మ‌రీ అమ్ముకున్నారు. దీంతో ఏపీలో కావాల్సిన‌న్ని క‌లెక్ష‌న్లు రావ‌డంతో ఇండ‌స్ట్రీ లో అన్ని సినిమాల రికార్డులు షేక్ అయిపోయాయి. అయితే ఇప్పుడు ఆన్ లైన్ టిక్కెటింగ్ ను కూడా తీసుకు రావ‌డంతో ఏపీ లో ఎంత పెద్ద హీరో సినిమా అయినా.. ఎంత సూప‌ర్ హిట్ సినిమా అయినా టిక్కెట్ ఎక్క‌వ రేట్ల‌కు అమ్ముకునే అవ‌కాశం లేదు.

ఈ క్ర‌మంలోనే ఇప్ప‌టికే బిజినెస్ లు పూర్త‌యిన  సినిమాల బిజినెస్ లో కోత‌లు పెట్ట‌క త‌ప్ప‌డం లేదు. బాల‌య్య అఖండ సినిమా ను 30 %  శాతం త‌గ్గించేశార‌ట‌. దీంతో రు. 9 కోట్ల‌కు న‌ష్టం వాటిల్లింద‌ట నిర్మాత ర‌వీంద‌ర్ రెడ్డికి..! ఇక పుష్ప సినిమా ను కూడా ముందు అమ్మిన రేట్ల తో పోలిస్తే 30 శాతం కోత పెట్ట‌డంతో రు. 15 కోట్ల మేర  కోత ప‌డింద‌ని అంటున్నారు. ఇక రాజ‌మౌళి ఎంతో ప్ర‌తిష్టాత్మ‌కంగా తెర‌కెక్కిస్తోన్న ఆర్ ఆర్ ఆర్ సినిమా ను ముందుగా అమ్మిన రేట్ల తో పోలిస్తే త‌ర్వాత త‌గ్గించారు. దీంతో ఈ ఒక్క సినిమా కే రు. 28 కోట్లు నష్టం వాటిల్లింద‌ని చెపుతున్నారు.

ఇక  పై మూడు సినిమా ల‌కు తోడుగా   మెగాస్టార్ చిరంజీవి ఆచార్య, ప‌వ‌న్ క‌ళ్యాణ్  భీమ్లా నాయక్, సర్కారు వారి పాట సినిమాల‌కు కూడా  20 శాతం డిస్కౌంట్ ఇచ్చినా రు. 70 కోట్లు న‌ష్టం త‌ప్ప‌దంటున్నారు. దీంతో పాటు సంక్రాంతి నుంచి వ‌చ్చే స‌మ్మ‌ర్ వ‌ర‌కు షెడ్యూల్ అయిన పెద్ద సినిమాలు.. మీడియం రేంజ్ సినిమా ల కు వ‌చ్చే న‌ష్టాలు కూడా లెక్కలు వేసుకుంటే మొత్తం రు. 100 కోట్ల కు పైగా న‌ష్టం వ‌స్తుంద‌ని ట్రేడ్  వ‌ర్గాలు అంచ‌నా వేస్తున్నాయి.  సో జ‌గ‌న్ మాస్ట‌ర్ స్ట్రోక్ ఇండ‌స్ట్రీకి మామూలుగా లేద‌నే చెప్పాలి.

 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: