కరోనా మూడో వేవ్ వస్తోందా.. ఎలెర్ట్ అవ్వాల్సిందే..!
కరోనా సెకండ్ వేవ్ అయితే మన దేశంలో అన్ని రాష్ట్రాలకు పాకేసింది. అందుకు ప్రతి ఒక్కరం భారీ మూల్యం చెల్లించు కున్నాం. అయినా కూడా జనాల్లో అయితే మార్పు రాలేదనే చెప్పాలి. అయితే కేంద్రం హెచ్చిరికల నేపథ్యంలో నూ మరో వైపు ప్రపంచ వ్యాప్తంగా కరోనా థర్డ్ వేవ్ వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో ఎవరికి వారు అలెర్ట్ అవుతున్నారు.
రష్యాలో మూడో వేవ్ ఘోరంగా పంజా విసురుతోంది . ఈ క్రమంలోనే మన దేశంలో కొన్ని రాష్ట్రాలు ఆక్సిజన్ కొరత లేకుండా ఉండేందుకు ముందు జాగ్రత్తలు తీసుకుంటున్నాయి. ఇక ఆసుపత్రుల్లో బెడ్ల కొరత లేకుండా ప్లాన్ చేసుకుంటున్నాయి. ఇక జిల్లాల వారీగా ఎక్కడికక్కడ అదనపు ఆసుపత్రుల తో పాటు తాత్కాలికంగా కూడా బెడ్లు , ఆసుపత్రులను ఏర్పాటు చేసుకుంటున్నాయి. ఇక ఇప్పటికే వ్యాక్సినేషన్ విషయంలో మన దేశం ప్రపంచంలో చాలా దేశాల కంటే ముందే ఉంది.
ఇప్పటికే 100 కోట్ల వ్యాక్సినేషన్ ప్రక్రియ పూర్తి అయ్యింది అని చెపుతున్నా.. ఇంకా వ్యాక్సినేషన్ వేయించుకునే వారు చాలా మందే ఉన్నారు. ఇక సెకండ్ డోస్ వేసుకోని వారు కూడా చాలా మందే ఉన్నారు. మరి వీరికి ఆ డోసుల ప్రక్రియ కూడా పూర్తయితే మన దేశం చాలా వరకు సేఫ్‌లో ఉన్నట్టే అనుకోవాలి.