చైనా నష్టాలు.. భారత్‌కు లాభాలు..?
అయితే.. ఇప్పట్లో ఇండియన్ స్టాక్ మార్కెట్‌కు వచ్చిన ఢోకా ఏమీ లేదంటున్నారు విశ్లేషకులు. అంతర్జాతీయ విశ్లేషకులు కూడా సమీప భవిష్యత్తులో ఇండియా స్టాక్ మార్కెట్లు దూసుకుపోతాయని చెబుతున్నారు. భారత స్టాక్ మార్కెట్ల దూకుడు మరో 50 ఏళ్లు ఉంటుందని ప్రముఖ ఇన్వెస్టర్ మార్క్ మొబియస్ చెప్పడం విశేషం. అంతే కాదు.. చైనా మార్కెట్లలోని నష్టాలు భారత మార్కెట్ల జోరుకు కారణమవుతాయని ఆయన విశ్లేషిస్తున్నారు.
10 ఏళ్ల క్రితం చైనా మార్కెట్లలో ఇలాంటి దూకుడు కనిపించేదని.. ఇప్పుడు ఆ పరిస్థితి.. ఇండియన్ మార్కెట్లలో కన్పిస్తోందని ప్రముఖ ఇన్వెస్టర్ మార్క్ మొబియస్ చెప్పారు. అందుకేనేమో.. మొబియస్ సారధ్యంలోని మొబియస్ కేపిటల్ పార్ట్‌నర్స్ ఎల్‌ఎల్‌పీ.. మొబియస్ ఎమర్జింగ్ మార్కెట్స్ ఫండ్‌లో 45 శాతం పెట్టుబడులను ఇండియా, తైవాన్ మార్కెట్లలోనే పెడుతోంది. ఈ ఎల్‌ఎల్‌పీ.. ఎక్కువగా హార్డ్‌వేర్, సాఫ్ట్‌వేర్ రంగాల్లో పెట్టుబడులు పెట్టింది.
ప్రస్తుతం చైనా మార్కెట్లు నష్టాల్లో ఉన్నాయి. ప్రముఖ ఇన్వెస్టర్ మార్క్ మొబియస్ పెట్టుబడులు చైనాలోనూ ఉన్నాయి. అందుకే ఆయన తన నష్టాలను పరిమితం చేసుకుని.. ఇండియన్ మార్కెట్ల వైపు చూస్తున్నారు. తన పెట్టుబడుల్లో దాదాపు సగం భారత్, తైవాన్ మార్కెట్లలోనే పెడుతున్నారు. చైనా మార్కెట్ల నష్టాలను ఆధారం చేసుకుని.. మొత్తం మార్కెట్ల పరిస్థితి బాగోలేదని అనుకోకూడదని.. భారత్ లాంటి దేశాల స్టాక్ మార్కెట్లు రాణిస్తున్న విషయాన్ని గమనించాలని ఆయన అంటున్నారు.