బండి సంజయ్‌ను హీరో చేస్తున్న కేసీఆర్..?
బండి సంజయ్.. తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు.. ఆయన బీజేపీ పగ్గాలు చేపట్టాకే తెలంగాణలో పార్టీకి జోష్ పెరిగింది... కేసీఆర్ తరహాలోనే మాటలతో అగ్గి పుట్టించడంలో దిట్ట బండి సంజయ్. ఇప్పుడు కేసీఆర్ రోజూ బండి సంజయ్‌ను తిడుతున్నారు. దీంతో మరోసారి బండి సంజయ్ టాక్ ఆఫ్ ద స్టేట్ అవుతున్నారు.. వాస్తవానికి బండి సంజయ్‌ది కేసీఆర్ స్థాయి కానే కాదు.. ఆ విషయం కూడా ఇటీవల కేసీఆరే ప్రెస్ మీట్లో చెప్పారు.. నువ్వేంటి.. నీ స్థాయి ఏంటి అని కడిగిపారేశారు.. కానీ.. విచిత్రం ఏంటంటే.. తన స్థాయితో ఏమాత్రం సరితూగని.. బండి సంజయ్ గురించి కేసీఆర్ ఎందుకు అంతగా రెచ్చిపోతున్నారు..? పదే పదే బండి సంజయ్ పేరు తెస్తూ తిడుతున్నారు.
రాజకీయాల్లో ఓ పాలసీ ఉండేది.. ఎవరైనా పొలిటికల్‌గా పెద్దవాళ్లు కావాలంటే... పెద్దవాళ్లపై ఆరోపణలు చేయాలనేది.. రేవంత్ రెడ్డి, బండి సంజయ్ లాంటి వాళ్లు ఈ పాలసీ ద్వారానే బడా నేతలుగా ఆవిష్కరించబడ్డారు. ఇప్పుడు కేసీఆర్ కొత్త పాలసీ తెస్తున్నారు. చిన్న స్థాయి నాయకులను పదే పదే తిట్టడం ద్వారా వాళ్లను పెద్ద వాళ్లను చేయడం.. బండి సంజయ్ ను అలాగే కేసీఆర్ పెద్ద వాడిని చేస్తున్నారేమో అనిపిస్తోంది.
మరి ఇదంతా కేసీఆర్ తనకు తెలియకుండానే చేస్తున్నారా అంటే అంత సులభంగా నమ్మలేం.. కేసీఆర్ ఏది చేసినా ఓ వ్యూహం ప్రకారమే చేస్తుంటారు.. మరి బండి సంజయ్‌ను తన తిట్ల ద్వారా హీరోను చేయడం కూడా వ్యూహంలో భాగమేనేమో.. ఆ కేసీఆర్‌కే తెలియాలి.