కేసీఆర్ టాక్స్ : రెండు గంటల ప్రెస్మీట్ ఏం సాధించాడ్రా!
కేంద్రంపై తిరుగుబాటు చేస్తానంటూ గత రెండు రోజులుగా కేసీఆర్ వరుస ప్రెస్మీట్లు పెడుతూ, చెప్పిందే చెబుతూ, అరిచిందే అరుస్తూ గోల చేస్తున్నాడు. ఈ ప్రెస్మీట్లలో తక్షణమే కేంద్రం ధాన్యం కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తున్నాడు. పెట్రో ఉత్పత్తులపై కేంద్రం విధించిన సెస్సులను తక్షణమే ఉపసంహరించుకోవాలని రెండో డిమాండ్ గా వినిపిస్తున్నాడు. ఈ రెండింటిపై నా పోరు ఉంటుందని పదే పదే చెబుతున్నాడు. ఇదే సందర్భంలో కేంద్రం తీరును ఎండగడుతున్నడు. ముఖ్యంగా విభజన చట్టం అమలులో నెలకొన్న జాప్యంపై ప్రశ్నిస్తున్నడు. ఇవన్నీ బాగానే ఉన్నా ఇంతకాలం గమ్మునుండి ఇప్పుడెందుకు సారు మాట్లాడుతున్నడు అన్నదే అతి పెద్ద ప్రశ్న.
తనలాంటి పాలన బీజేపీ పాలిత ప్రాంతాల్లోనే కాదు దేశంలోనే ఎక్కడా లేదని అంటున్నడు. ఎవ్వరైనా చెప్పగలరా బీజేపీ పాలిత ప్రాంతాలలో రెండు వేల రూపాయల పింఛను ఇస్తున్నరని? ఎవ్వరైనా చెప్పగలరా తన మాదిరి కల్యాణ లక్ష్మీ, షాదీ ముబారక్ పేరిట పథకాలను బీజేపీ పాలిత ప్రాంతాలలో అమలు చేస్తున్నారని? అని పేర్కింటూ ఇవన్నీ తానొక్కడినే చేస్తున్నానని స్పష్టం చేశాడు. దేశం ఆదాయంలో అధిక భాగం తెలంగాణ నుంచే వెళ్తుందని అంటున్నడు. ఈ మాట తనది కాదని ఆర్బీఐనే చెప్పిందని కూడా అంటున్నడు. వీటి తీరు ఎలా ఉన్నా ప్రతి రోజూ రెండు గంటలకు పైగా కేసీఆర్ చెప్పిందే చెప్పి ఏం సాధిస్తున్నడో అర్థం కాక కొందరు తలలు పట్టుకుంటున్నారు.