విషపూరితమైన యమునా నీటిలో బలవంతంగా స్నానాలు చేస్తున్న జనాలు..

Purushottham Vinay
ఛత్ 2021: యమునా నదిలో కాలుష్యం కారణంగా, వైట్ ఫోమ్, టాక్సిక్ ఫోమ్ అని కూడా పిలుస్తారు, నది ఉపరితలంపై తేలుతోంది. దూరం నుంచి చూస్తే యమునా ఉపరితలంపై తెల్లటి మంచు పరుచుకున్నట్లు అనిపిస్తుంది. ఇక నార్త్ ఇండియాలో ఛత్ పండుగని చాలా పవిత్ర పండుగగా జరుపుకుంటారు.కాగా, నాలుగు రోజుల పాటు జరిగే ఛత్ పండుగ సోమవారం నుంచి ప్రారంభమైంది. నహయ్ ఖయ్‌తో ప్రారంభమయ్యే ఈ పండుగకు దేశవ్యాప్తంగా భక్తులు ఈరోజు పవిత్ర నదులలో స్నానాలు చేస్తున్నారు. కానీ ఢిల్లీలో కాలుష్యం కారణంగా, భక్తులు యమునా నది విషపు నీటిలో స్నానం చేయవలసి వస్తుంది. తెలియని వారి కోసం, ఛత్ ఉపవాసం పాటించే మహిళలు నదిలో స్నానం చేయడం ద్వారా దానిని ప్రారంభిస్తారు. యమునా నది విషపు నురగ వల్ల మహిళలు కూడా అనారోగ్యం పాలవుతున్నారు. విషపు నురుగుతో కూడిన ఈ నీటిలో స్నానం చేయడం వల్ల భక్తులు అనారోగ్యానికి గురవుతారని గమనించాలి.


యమునా నదిలో అమ్మోనియా స్థాయి పెరిగిందని ఆదివారం ఢిల్లీ జల్ బోర్డు వైస్ చైర్మన్, ఆమ్ ఆద్మీ పార్టీ ఎమ్మెల్యే రాఘవ్ చద్దా తెలిపారు. కరోనావైరస్ మహమ్మారి దృష్ట్యా, ఢిల్లీ డిజాస్టర్ మేనేజ్‌మెంట్ అథారిటీ (DDMA) యమునా నది ఒడ్డున ఛత్ పూజను అనుమతించలేదు. అయినప్పటికీ నది ఒడ్డున ప్రజలు పండుగను జరుపుకుంటున్నారు.గణాంకాల ప్రకారం, 90 శాతం వ్యర్థ జలాలు యమునా నదిలోకి వెళ్తాయి. 58 శాతం వ్యర్థాలు యమునా నదిలోనే వెళ్తాయి. శుద్ధి చేయని మురుగు నీటిని కూడా యమునా నదిలో వదులుతున్నారు. మురుగు నీటిలో ఫాస్ఫేట్ మరియు ఆమ్లం ఉంటాయి, ఇవి విషపూరిత నురుగును ఏర్పరుస్తాయి. కాగా, యమునా నది కలుషిత నీటిపై కూడా రాజకీయాలు మొదలయ్యాయి. నీటిపై అమ్మోనియా కలిపిన విషం తేలుతుందని బీజేపీ ఎంపీ మనోజ్ తివారీ అన్నారు. "అరవింద్ కేజ్రీవాల్ ఇక్కడికి వచ్చి ఉండాల్సింది.. మా అమ్మానాన్నలు ఈ నీళ్లలో మునిగిపోతున్నారు. ఢిల్లీ ప్రజలకు ఇదేనా న్యాయం.. ఈ విషయాన్ని కోర్టు దృష్టికి తీసుకెళ్లి ఢిల్లీ ప్రభుత్వాన్ని బర్తరఫ్ చేయాలి’’ అని ఆయన అన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: