కేసీఆర్ ఫైరింగ్ ప్రసంగంపై ఆ కులస్తులు ఫుల్ ఖుష్..?

Chakravarthi Kalyan
హుజూరాబాద్ ఉపఎన్నికల్లో ఘోర పరాజయం తర్వాత కేసీఆర్ మొదటిసారి నిన్న బయటకు వచ్చారు. ప్రధానంగా వరి కొనుగోలు అంశం, పెట్రోల్ ధరలపై కేంద్రం వైఖరి వంటి విషయాలపై ఘాటుగా మాట్లాడారు. అదే సమయంలో కేసీఆర్ మరో క్లారిటీ కూడా ఇచ్చారు. హుజూరాబాద్ ఉపఎన్నికల సమయంలోనే కేసీఆర్ దళిత బంధు పథకం ప్రకటించారు. ప్రతి దళిత కుటుంబానికి రూ. 10 లక్షల రూపాయల ఆర్థిక సాయం చేస్తానని కేసీఆర్‌ దేశంలోనే అతి పెద్ద సంక్షేమ పథకాన్ని ప్రకటించారు.


అయితే.. ఈ దళిత బంధు  హుజూరాబాద్ ఉపఎన్నికల్లో దళితుల ఓట్లు వేయించుకోవడానికి పన్నిన పన్నాగంగా భావించారు. అందులోనూ ఇలాంటి పథకాలు.. ప్రకటనల విషయంలో కేసీఆర్‌ పై జనంలో విశ్వసనీయత తక్కువే.. ముఖ్యంగా దళితుల విషయంలో ఆయన గతంలో స్వయంగా అనేక హామీలు ఇచ్చి మాట తప్పారు కూడా. అందుకే ఈ దళిత బంధు కేవలం హుజూరాబాద్ ఉపఎన్నిక కోసం వేసిన ఎత్తుగడగా భావించారు. బీజేపీ కూడా హూజూరాబాద్‌లో ఇదే ప్రచారం చేసింది.


నిన్న కేసీఆర్ తన ప్రెస్‌ మీట్‌లో దళిత బంధు పథకంపై క్లారిటీ ఇచ్చేశారు. కేసీఆర్ బతికున్నంత వరకూ దళిత బంధు పథకం కొనసాగుతుందని స్పష్టంగా చెప్పేశారు. ఒక్క ఉపఎన్నికలో ఓడినంత మాత్రాన బ్రహ్మాండం ఏమీ బద్దలైపోదని కేసీఆర్ అన్నారు. ఎన్నికలు అన్నాక ఒకటి ఓడతం.. ఒకటి గెలుస్తాం.. దీనికోసం అంత కిందా మీదా పడాల్సిన పనిలేదని కేసీఆర్ సింపుల్‌గా తేల్చి చెప్పేశారు. కేసీఆర్ ఇచ్చిన క్లారిటీతో దళితులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.


కేసీఆర్ దళిత బంధు పథకాన్ని ముందుగా నాలుగైదు నియోజక వర్గాల్లో ప్రయోగాత్మకంగా ప్రారంభించారు. హుజూరాబాద్‌తో పాటు  మరో నాలుగు నియోజకవర్గాల్లో ఈ పథకం కోసం నిధులు కేటాయించారు. దాన్ని క్రమంగా రాష్ట్రమంతటా విస్తరిస్తామని చెప్పారు. ఇప్పుడు ఇచ్చిన మాట తప్పేది లేదని కేసీఆర్ ప్రకటించడంతో దళితులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: