పెట్రో ధరలకు సంబంధించి రాజకీయం భగ్గుమంటోంది. కేంద్రంలో పెట్రోలు ధర ఐదు రూపాయలు,
డీజిల్ ధర పది రూపాలయలు తగ్గించడంతో వినియోగదారుడికి కాస్త ఊరట వస్తుందని భావించారు అంతా! కానీ ఏపీలో మాత్రం అందుకు భిన్నం అయిన వాతావరణం ఉంది. ఎక్సైజ్ డ్యూటీని తగ్గించుకోవడం వల్ల కేంద్రం ఏటా లక్ష కోట్ల రూపాయలు (దాదాపు) కోల్పోవాల్సి వచ్చినా కూడా ఎక్కడా కూడా తొణకక, బెణకక ఈ నిర్ణయం తీసుకోవడం వెంటవెంటనే అమలు చేయడం ఓ శుభ పరిణామం. ఇదే సమయంలో రాష్ట్రాలు కూడా తమ పరిధిలో ఉన్న వ్యాట్ ను తగ్గించుకునేందుకు సిద్ధం అయ్యాయి.
బీజేపీ పాలిత ప్రాంతాలు ఇప్పటికే ఆ నిర్ణయాన్ని అమలు చేశాయి. కొన్ని రాష్ట్రాలు ఏడు రూపాయల వరకూ తమ పరిధిలోఉన్న పన్నులను తగ్గించేందుకు ముందుకు వచ్చాయి.
బెంగళూరు కూడా అదేవిధంగా రేటు తగ్గించింది. పొరుగున ఉన్న
ఒడిశా కూడా రేటు తగ్గించి మూడు రూపాయల మేరకు పన్ను తగ్గింపునకు సుముఖత వ్యక్తం చేసి వినియోగదారుల మన్ననలు అందుకుంది. కానీ బెంగళూరుతో పోలిస్తే మన దగ్గర పెట్రోలు ధర 9 రూపాయల 77 పైసలు తేడాగా ఉంది. అయినా కూడా దక్షిణాది రాష్ట్రాలలో కర్ణాటక ఒక్కటే చొరవ చూపి తన వాటా పన్నులు తగ్గించినా మిగతా రాష్ట్రాలు ముందుకు రాకపోవడం శోచనీయమని
బీజేపీ నేత జీవీఎల్ బాధపడుతున్నారు. ఈ క్రమంలోనే
బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు రాష్ట్ర వ్యాప్త నిరసనలకు పిలుపునిచ్చారు. పెట్రో ఉత్పత్తులకు సంబంధించి రాష్ట్రాల వాట కింద ఉన్న పన్ను తగ్గించాలన్న డిమాండ్ సోము వీర్రాజు రోడ్డెక్కుతున్నారు. అయితే ఇదే సమయంలో జగన్ ఓ ప్రకటన విడుదల చేశారు.
వంద రూపాయలు పెంచి ఐదు రూపాయలు తగ్గించడంలో ఏమయినా న్యాయం ఉందా అని ఈ రోజు ప్రధాన పత్రికలకు ఫుల్ పేజ్ యాడ్ రూపంలో వాస్తవాలు వివరించేందుకు ప్రయత్నించారు. పెట్రోలు,
డీజిల్ పై కేంద్రం వసూలు చేసింది 3,35,000 కోట్ల రూపాయలు కాగా ఇందులో రాష్ట్రాలకు పంచిన డబ్బుల వాటా 5.80 శాతం మాత్రమేనని వాపోయారు జగన్. ఈ లెక్కన పన్నుల రూపేణా రాష్ట్రాలకు పంచిన డబ్బులు 19,475 కోట్ల రూపాయలు అని తేల్చారు జగన్. వాస్తవానికి మనకు దక్కాల్సింది 41 శాతం పన్ను వాటా అయినా అంత స్థాయిలో నిధులివ్వక కేంద్రం అలసత్వం చూపుతోంది ఆరోపిస్తున్నారు జగన్. మరి! వీటిపై
బీజేపీ ఏ విధంగా స్పందిస్తుందో అన్నది ఇప్పుడిక కీలకం.