తెలంగాణ : బీజేపీ పెద్దలంతా ఎటేపో తెల్సా?
ఈ క్రమంలో తెలంగాణ, ఆంధ్రా కలిపి నలభై ఎంపీ సీట్లు ఉన్నాయి. అదేవిధంగా ఇప్పటికైతే పెద్దల సభలో కూడా బీజేపీకి మంచి పట్టే ఉంది. కనుక తాను అనుకున్నవన్నీ చక్కదిద్దుకోవడంలో సఫలీకృతం అవుతోంది. కానీ ఉత్తరాది పార్టీలు కొన్ని బీజేపీని ముందు నుంచి వ్యతిరేకిస్తున్నాయి. వ్యవసాయ చట్టాలపై పంజాబ్, హర్యానా రాష్ట్రాలు ఇప్పటికే అసమ్మతి స్వరాన్ని వినిపిస్తున్నాయి. ఈశాన్యంతో బీజేపీకి పెద్ద గా విభేదం లేకపోయినా కీలకం అయిన ఉత్తరాదిలో నెగ్గుకు రావడమే అసలు సమస్య. పశ్చిమ బెంగాల్ లో తృణముల్ కాంగ్రెస్ బలపడితే ఆ ఫలితం వేరుగా ఉంటుంది. బీహార్ లో కూడా ప్రాంతీయ శక్తులు బలపడితే జాతీయ పార్టీకి చుక్కలే చుక్కలు. ఇలా ఎక్కడ చూసుకున్నా కూడా బీజేపీ పై ఉన్న వ్యతిరేకత ప్రాంతీయ శక్తులకు తదనుగుణ పార్టీలకు లాభం చేకూర్చే విషయమే. అందుకే బీజేపీ తెలివిగా అయితే ప్రాంతీయ పార్టీలలో చీలిక తేవడం లేదంటే వారితో దోస్తీ అంటూ కౌగిలించుకుని గొంతెమ్మ కోర్కెలు ఏవయినా ఉంటే తీర్చి పంపడం అన్న పనులేవో చేస్తూ సర్దుకుపోతోంది. కనుక ఈటెల ఎంత దూసుకుపోయినా బీజేపీలో తన హవాను కొనసాగించడం కష్టం. కేసీఆర్ హవా ఇక్కడ అంటే బీజేపీ లో ప్రబలంగా ఉన్నంత వరకూ ఈటెలకు కష్టమే!