జగన్..ఆ ఇద్దరి రెడ్లకు న్యాయం చేస్తారా?
ముఖ్యంగా మంత్రివర్గంలో అదే పరిస్తితి..ప్రస్తుతం జగన్ క్యాబినెట్లో నలుగురు రెడ్డి వర్గానికి చెందిన మంత్రులు ఉన్నారు...బాలినేని శ్రీనివాసరెడ్డి, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, మేకపాటి గౌతంరెడ్డి, బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డిలు క్యాబినెట్లో ఉన్నారు. అయితే నెక్స్ట్ మంత్రివర్గ విస్తరణ జరిగేటప్పుడు వీరిని పక్కనబెట్టి వేరే వారికి ఛాన్స్ ఇవ్వనున్నారు. కాకపోతే ఈ సారి ఎంతమంది రెడ్లని మంత్రివర్గంలో తీసుకుంటారనేది క్లారిటీ లేదు.
సామాజికవర్గాలని బ్యాలెన్స్ చేయాలి కాబట్టి...మళ్ళీ అదే నలుగురికి పదవులు ఇచ్చే ఛాన్స్ ఉంది. కాకపోతే రెడ్లలో సత్తా ఉన్న నాయకులు చాలామంది ఉన్నారు. వారు మంత్రి పదవి దక్కించుకోవడం కోసం పోటీ పడుతున్నారు. అసలు గుంటూరు జిల్లాలోనే ఇద్దరు రెడ్లు...పదవి రేసులో ఉన్నారు. ఆ ఇద్దరు స్ట్రాంగ్ నాయకులే. మరి వారిలో ఎవరికి ఛాన్స్ ఇస్తారనేది ఆసక్తికరంగా మారింది. ఇటు మంగళగిరి నుంచి ఆళ్ళ రామకృష్ణారెడ్డి ఉన్న విషయం తెలిసిందే. ఈయనకు మంత్రి పదవి ఇస్తానని ఎన్నికల సమయంలోనే జగన్ హామీ ఇచ్చారు. అలాంటప్పుడు ఈయనకు ఖచ్చితంగా పదవి ఇవ్వాల్సిన అవసరముంది. ఇక సబ్జెక్ట్ పరంగా ఆళ్ళ పర్ఫెక్ట్ నాయకుడు.
అటు ఫాలోయింగ్‌లో మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి తిరుగులేదు. వరుసగా మాచర్ల నుంచి ఎమ్మెల్యేగా గెలుస్తూ వస్తున్న పిన్నెల్లి...జిల్లాలోని ఎమ్మెల్యేల్లో టాప్‌లో ఉన్నారు. ఈయన అంటే ఓటమి కూడా దూరంగానే ఉంటుంది. జిల్లాలో పెద్ద ఎత్తున ఫాలోయింగ్ కూడా ఉంది...ఈయన కూడా మంత్రి పదవికి అర్హుడే. కానీ ఇద్దరు రెడ్డి ఎమ్మెల్యేల్లో జగన్ ఒకరికే ఛాన్స్ ఇవ్వొచ్చు. మరి ఆ ఛాన్స్ ఎవరికి వస్తుందనేది చూడాలి.