వంగవీటి వైసీపీలోకి.. నో ఛాన్స్...?

VUYYURU SUBHASH
ఏపీలో కాపు వర్గంలో ఫుల్ ఫాలోయింగ్ ఉన్న వంగవీటి రాధా రాజకీయ భవిష్యత్ అనేక కీలక మలుపులు తిరుగుతుంది. ఆయన రాజకీయంగా ఎప్పుడు సెట్ అవుతారా? అని ఆయన అభిమానులు ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు. దాదాపు 20 ఏళ్ల నుంచి రాజకీయం చేస్తున్న రాధా...ఇంతవరకు రాజకీయంగా సెట్ కాలేకపోయారు. ఒక్కసారి మాత్రమే ఎమ్మెల్యేగా గెలిచే అవకాశం దక్కింది. ఆ తర్వాత రాధాకు గెలుపు దక్కలేదు. అనేక పార్టీలు మారినా సరే ప్రయోజనం లేకుండా పోయింది.
ఇప్పుడు రాధా ఏ పార్టీలో ఉన్నారో కూడా క్లారిటీ లేదు. టీడీపీ నేతలు మాత్రం...రాధా టీడీపీలోనే ఉన్నారని చెబుతున్నారు. గత ఎన్నికల ముందు రాధా టీడీపీలో చేరిన విషయం తెలిసిందే. కానీ ఎన్నికల్లో పోటీ చేయలేదు. ఎన్నికల్లో టీడీపీ ఓడిపోయాక రాధా కాస్త ఆ పార్టీకి దూరం జరిగారు. అలా అని వేరే పార్టీలోకి వెళ్లలేదు. కాకపోతే తన సామాజికవర్గానికి సంబంధించి ఏమన్నా కార్యక్రమాలు జరిగితే వాటిల్లో పాల్గొంటున్నారు. అలాగే రంగా విగ్రహాల ఆవిష్కరణకు వెళుతున్నారు.
అయితే ఈ మధ్య ఓ ఫంక్షన్‌లో రాధా..కొడాలి నానిని కలిశారు. దీంతో రాధా వైసీపీలో వెళుతున్నారని ప్రచారం జరిగింది. కానీ రాధా వైసీపీలోకి వెళ్ళే ఛాన్స్ లేదని, ఆయన అనుచరుల ద్వారా తేలింది. ఇక ఇటీవల ఆయన పుట్టినరోజు సందర్భంగా చంద్రబాబుతో సహ టీడీపీ నేతలు...పెద్ద ఎత్తున శుభాకాంక్షలు చెప్పారు. ఆయన్ని టీడీపీ నేత గానే చెబుతున్నారు.
దీంతో రాధా టీడీపీలోనే ఉన్నారని తెలుస్తోంది. పైగా అమరావతి ఉద్యమానికి రాధా మద్ధతు ఇస్తున్నారు. ఈ మధ్య టీడీపీ నేత పట్టాభి ఇంటిపై వైసీపీ శ్రేణులు దాడులు చేసినప్పుడు..రాధా, పట్టాభి ఇంటికెళ్లారు. దీని బట్టి చూస్తే రాధా టీడీపీకి దగ్గరగానే ఉన్నారు. అదే సమయంలో పవన్ కూడా టీడీపీకి దగ్గరవుతున్నారనే టాక్ ఉంది. కాబట్టి రాధా టీడీపీలో ఉంటూ నెక్స్ట్ పోటీ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి...కానీ వైసీపీలోకి మాత్రం వెళ్ళే ఛాన్స్ లేదని తెలుస్తోంది.

 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: