కొడాలి కాన్ఫిడెన్స్: బాబు-పవన్‌లకు ఆ సత్తా లేదా?
తాజాగా పవన్ కల్యాణ్...సైతం ఉద్యమంలో పాల్గొని...ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా పోరాటం మొదలుపెట్టారు. అలాగే బీజేపీని టార్గెట్ చేయకుండా, వైసీపీని టార్గెట్ చేస్తూ పవన్ విమర్శలు చేశారు. అలాగే కేంద్రంపై పోరాడాల్సింది వైసీపీనే అని, అలాగే అఖిలపక్షాన్ని ఏర్పాటు చేసి ఢిల్లీకి తీసుకెళ్లాలని, వారం రోజుల్లో తీసుకెళ్లపోతే ఉద్యమం తీవ్రం అవుతుందని పవన్ హెచ్చరించారు.
ఇక వెంటనే పవన్‌పై వైసీపీ నేతలు ఎటాక్ మొదలుపెట్టారు...తాము స్టీల్ ప్లాంట్ కోసం పోరాటం చేశామని, పవన్ కేంద్రంలోని బీజేపీపై పోరాటం చేయకుండా, తమపై పోరాటం చేస్తున్నారని, పవన్ పూర్తిగా రాజకీయం చేస్తున్నారని మండిపడుతున్నారు. ఈ క్రమంలోనే మంత్రి కొడాలి నాని కూడా స్పందించారు... విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అంటూ, తమకు వారం రోజులు గడువు ఇవ్వడం హాస్యాస్పదమని కొడాలి, పవన్‌కు కౌంటర్ ఇచ్చారు.
ఇక చచ్చిపోయిన పార్టీల నాయకులైన పవన్ కళ్యాణ్, చంద్రబాబులకు ఎవరూ భయపడరని, ఇక్కడ హడావిడి చేయకుండా పవన్ కళ్యాణ్‌కు దమ్ముంటే, ఢిల్లీ వెళ్లి మోదీకి డెడ్ లైన్ పెట్టాలని, కేంద్రంపై పోరాటం చేసి స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణని ఆపాలని కొడాలి చెప్పారు. అంటే చంద్రబాబు, పవన్ కల్యాణ్‌లకు ఢిల్లీపై పోరాటం చేసే సత్తా లేదని కొడాలికి బాగా కాన్ఫిడెన్స్ ఉన్నట్లు కనిపిస్తోంది. అదే సమయంలో టీడీపీ, జనసేనలు చచ్చిపోయిన పార్టీలు అని చెప్పడం చూస్తే, ఇంకా వైసీపీకి తిరుగులేదనే కాన్ఫిడెన్స్ కొడాలి చూపిస్తున్నారు.