బద్వేలులో బీజేపీకే ప్లస్...నష్టం ఎవరికి?
వైసీపీ విషయం పక్కనబెడితే...ఇక్కడ ఓడిపోయిన బీజేపీ, కాంగ్రెస్‌లు నష్టపోలేదనే చెప్పాలి. ఎందుకంటే ఆ పార్టీలకు అన్నీ ఓట్లు రావడం అనేది మామూలు విషయం కాదు. అంటే పరోక్షంగా టీడీపీ, జనసేనలు పోటీ చేయకపోవడం, ఆ పార్టీలకు ప్లస్ అయిందనే చెప్పాలి. పైగా టీడీపీ-జనసేనలు బీజేపీకి సపోర్ట్ ఇచ్చాయి. అంటే ఆ రెండు పార్టీలే పరోక్షంగా నష్టపోయాయని చెప్పాలి. కానీ ఇక్కడ టీడీపీ ఓట్లు ఎక్కువ.. కాబట్టి టీడీపీకే పెద్ద బొక్క పడింది.
ఇక్కడ టీడీపీ ఓట్లు నాలుగు రకాలుగా చీలిపోయాయి. అది ఎలా ఉంటే టీడీపీ..ప్రధానంగా బీజేపీకి సపోర్ట్ ఇచ్చింది. అలా అని బద్వేలులో ఉన్న టీడీపీ ఓటర్లు అంతా బీజేపీకే సపోర్ట్ చేయలేదు. కాకపోతే కొంతవరకు సపోర్ట్ ఇచ్చింది...అందుకే గత ఎన్నికల్లో కేవలం 735 ఓట్లు సాధించిన బీజేపీ...ఇప్పుడు 21 వేల ఓట్లు సాధించింది. అంటే బీజేపీకే ప్లస్ అని చెప్పొచ్చు. అదేవిధంగా టీడీపీలోని కొందరు దళితులు వైసీపీ వైపుకు వెళ్లారు. ఇక కొందరు కాంగ్రెస్ వైపుకు కూడా మొగ్గు చూపారని చెప్పొచ్చు. అందుకే గత ఎన్నికల్లో 2 వేల ఓట్లు వరకు తెచ్చుకున్న కాంగ్రెస్ ఇప్పుడు 6 పైనే ఓట్లు తెచ్చుకుంది.
ఆఖరికి నోటా ఓట్లు కూడా మారాయి. గత ఎన్నికల్లో నోటాకు 2 వేల ఓట్లు వస్తే, ఇప్పుడు 3600 పైనే ఓట్లు వచ్చాయి. అంటే టీడీపీ ఓట్లు ఎన్ని రకాలుగా చీలిపోయాయో చెప్పాల్సిన పని లేదు. మొత్తానికి చూసుకుంటే బద్వేలులో వైసీపీకి తిరుగులేదని అర్ధమైంది...అదే సమయంలో బీజేపీ, కాంగ్రెస్‌లు లాభపడగా, చివరికి టీడీపీ నష్టపోయింది.