కేసీఆర్ Vs ఈటెల: ఫ్యూచర్ మాదే... బాబోరి రేవంత్...?
హుజురాబాద్ ఎన్నికల ఫలితాలపై సంపూర్ణమైన భాద్యత నాదే అన్నారు రేవంత్. నివేదికలు తెప్పించుకొని విశ్లేషణ చేసుకుంటాం అన్నారు రేవంత్ రెడ్డి. రాబోయే రోజులన్ని కాంగ్రెస్ పార్టీవే అని ధీమా వ్యక్తం చేసారు. ప్రజా సమస్యలపై మరింత బాధ్యతగా కొట్లాడుతాం అన్నారు ఆయన. హుజురాబాద్ ఉప ఎన్నికల ప్రత్యేకమైన పరిస్థితుల్లో జరిగాయి అని ఉప ఎన్నిక కాంగ్రెస్ పార్టీ భవిష్యత్ ను నిర్ణయించలేవు అని స్పష్టం చేసారు. గత ఎన్నికల్లో హుజురాబాద్ లో బిజెపి కి 16వందల ఓట్లు మాత్రమే వచ్చాయి- ఇప్పుడు గెలిచింది అని అన్నారు.
మొన్న జరిగిన నాగార్జున సాగర్ ఎన్నికలో బిజెపి కనిపించలేదు అని ఎద్దేవా చేసారు. మీ కోసం నేను ఉంటా- ఈ ఓటమి నన్ను కుంగదియ్యదు అని అన్నారు. ఈ ఫలితాలు- హుజురాబాద్ ఎన్నికపై భవిష్యత్ లో స్పందిస్తా అని ఆయన పేర్కొన్నారు. ఈ ఓటమి నిరాశ శాశ్వతం కాదు- నిరాశ నుంచి నిర్మాణం చేపడుతాం అని స్పష్టం చేసారు. కాంగ్రెస్ లో సీనియర్ నాయకులకు పార్టీలో స్వేచ్ఛ ఎక్కువ ఉంటుంది అని పార్టీ విషయాలు అంతర్గత సమావేశాల్లో చర్చించుకుంటాం అని స్పష్టం చేసారు. సీనియర్లు అందరూ విదేశాల నుంచి వెనక్కి రప్పించుకోని పార్టీ కార్యక్రమాల్లో కలుపుకుని వెళతాం అని ఆయన స్పష్టం చేసారు.