ఫేస్‌బుక్ పేరు మెటాగా మారిన విషయం తెలిసిందే. గతంలో గూగుల్ పేరెంట్ కంపెనీగా అల్ఫాబెట్ ఎలాగైతే మారిందో ఇప్పుడు మెటా పేరెంట్ కంపెనీలో ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, వాట్సప్ లు ఉంటాయి. అయితే, ఫేస్‌బుక్ అధినేత మార్క్ జుకర్ బర్గ్ ఎందుకు పేరు మార్చాడు అనే దానికి వివిధ కారణాలు తెలుస్తున్నాయి. అవేంటంటే ఇటీవలీ కాలంలో ఫేస్‌బుక్ బాగా చెడ్డపేరు తెచ్చుకుంది. వాట్సప్, ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌లపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. ఇన్‌స్టాగ్రామ్ ఎక్కువగా యువత వాడుతున్న నేపథ్యంలో ఎక్కువగా దుష్ప్రభావం పడుతుందని అనేక పరిశోధనల్లో వెల్లడయింది.
తాజా నివేధికల ప్రకారం ఫేస్‌బుక్ సామాజంలో విద్వేషాలను రెచ్చగొడుతుందని, అనేక మానసిక సమస్యలకు కారణమవుతుంది, డెమోక్రాటిక్ ను మానిపులేట్ చేస్తుందనే విమర్శలు కూడా ఉన్నాయి. అయితే, ఇదంతా ఫేస్‌బుక్ కంపెనీకి తెలిసే ఇదంతా జరుగుతుందని తాజాగా విడుదలయిన 10 వేల డాక్యుమెంట్లు కూడా వెల్లడించాయి. ఇలాంటి సందర్భంలో ఫేస్ బుక్ పేరు మార్చడం కార్పొరేటిక్ స్ట్రాటజీలో భాగంగా ఉంది. మెటా అనే కొత్త పేరు మార్పు ద్వారా ఓ కొత్త ఇమేజ్ మేనేజ్‌మెంట్ మార్క్ జూకర్‌బర్గ్ చేస్తున్నాడనేది ఒక వాదన వినిపిస్తోంది. అలాగే, ఫేస్‌బుక్ కంపెనీలో చాలా ప్రొడక్ట్స్ ఉన్నాయి. ఆక్కులస్ అనే సాఫ్ట్‌వేర్ కంపెనీ లాంటి చాలా సాఫ్ట్‌వేర్ ప్రొడక్ట్స్ కూడా ఉన్నాయి.
అలాగే, ఫేస్‌బుక్ ఫ్యూచర్ టెక్నాలజీలో భారీగా ఇన్వెస్ట్ చేస్తోంది. ఈ టెక్నాలజీనే మెటావర్స్ అంటారు. అంటే, ఇంటర్నెట్ కంటే ముందు మనం దానిని ఊహించలేము కదా అలాంటి టెక్నాలజీనే మెటావర్స్‌ను టెక్నాలజీ అభివృద్ధిలో మార్క్ జుకర్‌బర్గ్ పెద్ద ఎత్తున పెట్టుబడులు పెడుతోంది. ఈ వర్చ్‌వల్ టెక్నాలజీ కొత్త కృత్రిమ ప్రపంచాన్ని సృష్టించబోతోంది. భవిష్యత్ ఇంటర్నెట్ తరువాత మెటావర్స్ ది అని నిపుణులు చెబుతున్నారు. భవిష్యత్ అలావంబనగా మెటావర్స్ నుంచి మెటాను తీసుకుని మెటాగా ఈ కంపెనీగా నిర్వహిస్తారు. తన టెక్నాలజీ భవిష్యత్ లోకి ఎంటర్ అయిందన్న సంకేతాలను ఇవ్వడానికి కొత్త పేరు పెట్టాడనే వాదన కూడా వినిపిస్తోంది.