సైలెంట్‌గా సెట్ చేసేసిన బాబు...జగన్‌కే ప్లస్?
ఎలాగో రాష్ట్రంలో తనకు అనుకూలంగా పరిస్తితి లేదు...దీంతో ఎలాగైనా తనకు అనుకూలమైన వాతావరణం కల్పించుకోవాలని, మళ్ళీ బలపడాలని బాబు బాగానే ప్రయత్నిస్తూనే ఉన్నారు. ఈ ప్రయత్నాల్లో భాగంగానే బాబు...మళ్ళీ బీజేపీకి ఎలా దగ్గరవ్వాలని ప్రయత్నించారో అందరికీ తెలిసిందే. ఎలాగైనా బీజేపీకి దగ్గరయ్యి మళ్ళీ కేంద్రంలో పట్టు సాధించి..దాని ద్వారా ఏపీలో సత్తా చాటాలని చూస్తూనే ఉన్నారు. అందుకు తగ్గట్టుగానే తన సన్నిహితులని సైతం బీజేపీలోకి పంపించారు.
కానీ ఎక్కడా కూడా బాబు పప్పులు ఉడకలేదు...బీజేపీ, బాబుని దగ్గరకు మాత్రం రానివ్వలేదు. అయినా సరే బాబు తన ప్రయత్నాలు ఆపకుండా ఏదొరకంగా బీజేపీకి దగ్గరవ్వాలని చూస్తూనే వచ్చారు. అలాగే ఇటు పవన్ కల్యాణ్ మద్ధతు కూడా తీసుకోవాలని చూశారు. కానీ ఏది వర్కౌట్ కాలేదు. అయితే ఏమైందో ఏమో గానీ గత కొంతకాలంగా ఏపీ రాజకీయాల్లో పూర్తి మార్పులు వచ్చాయి. ఎప్పుడైతే పవన్...జగన్ టార్గెట్‌గా రాజకీయం చేయడం మొదలుపెట్టారో అప్పటినుంచి సీన్ మారింది. అప్పటినుంచే పవన్, బాబుకు మద్ధతుగా ఉన్నారని క్లారిటీ వచ్చింది.
ఇక పవన్ ఎలాగో...బీజేపీతో పొత్తులో ఉన్న విషయం తెలిసిందే. అయితే బద్వేలు ఉపఎన్నిక నేపథ్యంలో బీజేపీ కూడా బాబుకు దగ్గరకు జరిగినట్లే తెలుస్తోంది. ఎప్పుడైతే అమిత్ షా, బాబుకు ఫోన్ చేశారో అప్పటినుంచి సీన్ మారింది. ఇప్పుడు బద్వేలు ఉపఎన్నికతో బాగా క్లారిటీ వచ్చేసింది...బద్వేలులో టీడీపీ శ్రేణులు పూర్తిగా బీజేపీకి అనుకూలంగా మారిపోయాయి. దీని బట్టి చూస్తే బాబు...సైలెంట్‌గా బీజేపీ, పవన్‌లని దగ్గర చేసుకున్నట్లే కనిపిస్తోంది. అయితే ఈ ముగ్గురు కలియక రాజకీయంగా జగన్‌కు ప్లస్ అయ్యే ఛాన్స్ కూడా ఉంది. చూడాలి మరి ఏపీ రాజకీయాలు ఇంకెన్ని మలుపులు తిరుగుతుందో?