చంద్రబాబు సంచలన ప్రకటన.. అందరూ షాక్?
ఈ క్రమంలోనే టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు తన సొంత నియోజకవర్గమైన కుప్పంలో పర్యటన మొదలు పెట్టారు అన్న విషయం తెలిసిందే కార్యకర్తలను కలుస్తూ వారి బాగోగులు తెలుసుకుంటున్నారు. అంతేకాదు ఇక నియోజకవర్గంలో ఉన్న ప్రజలందరి సమస్యలు తెలుసుకుంటూ ఉన్నారు చంద్రబాబు నాయుడు. అయితే ఇలా చంద్రబాబు నాయుడు కుప్పం పర్యటనఫై కూడా వైసీపీ నేతలు తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పిస్తూ ఉండటం గమనార్హం. ఇకపోతే కుప్పం పర్యటనలో భాగంగా చంద్రబాబు నాయుడు చేసిన ఒక ప్రకటన మాత్రం ప్రస్తుతం ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారిపోయింది. రాజకీయ విశ్లేషకులనే ఆశ్చర్యానికి గురి చేస్తుంది అని చెప్పడంలో అతిశయోక్తి లేదు.
కుప్పం పర్యటనలో భాగంగా ముందస్తు ఎన్నికలు రాబోతున్నాయి అందరూ సిద్ధంగా ఉండాలి అంటూ చంద్రబాబు పిలుపునిచ్చారు ఇక చంద్రబాబు చేసిన ఈ వ్యాఖ్యలు కాస్త హాట్ టాపిక్ గా మారిపోయాయి. ప్రస్తుతం జగన్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి దాదాపు రెండున్నర ఏళ్లు గడుస్తున్నాయ్. ఇంకా రెండున్నర ఏళ్ల పాలనా సమయం ఉంది అయితే సాధారణంగా ముందస్తు ఎన్నికలు అంటే ఆరు నెలల ముందు వస్తాయి అని అందరూ అంచనా వేస్తారు. కానీ రెండు నెలల ముందు ముందస్తు ఎన్నికలు రావడం ఏంటి అందరూ ఆశ్చర్యపోతున్నారు. కార్యకర్తల్లో ఉత్సాహం నింపడానికి మాత్రమే ఇలాంటి స్టేట్మెంట్ ఇచ్చారా లేకపోతే ఏదైనా వ్యూహం ఉందా అన్న దానిపై మాత్రం ప్రస్తుతం ఆసక్తికర చర్చ నడుస్తోంది.