విద్యుత్ శాఖపై జగన్ సంచలన నిర్ణయం !

Veldandi Saikiran
అమరావతి : ఏపీ గ్రీన్ ఎనర్జీ కార్పోరేషన్ లిమిటెడు ను విద్యుత్ పంపిణీ సంస్థ గా మార్పు చేస్తూ నిర్ణయం తీసుకుంది జగన్‌ సర్కార్‌. ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్ర గ్రీన్ ఎనర్జీ కార్పోరేషన్ పేరు ను ఏపీ రూరల్ అగ్రికల్చర్ పవర్ సప్లై కంపెనీ (ఏపీ రాస్కామ్ )గా మార్చారు  ఏపీ ప్రభుత్వం. వ్యవసాయా నికి ఉచిత విద్యుత్ పంపిణీ కోసం విద్యుత్ పంపిణీ సంస్థగా పనిచేయనుంది ఏపీ రాస్కామ్. ప్రస్తుతాని కి ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్రం లోని మూడు డిస్కంలకు చెందిన విద్యుత్ పంపిణీ వ్యవస్థ ను వినియోగించుకుని సేవలందించనుంది ఏపీ రాస్కామ్. 


మూడు డిస్కంల గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న పంపిణీ లైన్ల ను వినియోగించు కునేందుకు వీలింగ్ ఛార్జీలను చెల్లించనుంది కొత్త కంపెనీ రాస్కామ్. పంపిణీ వ్యవస్థ ను ఏర్పాటు చేసుకునేంత వరకూ డిస్కంల కూ వీలింగ్ ఛార్జీల చెల్లింపు నకు నిర్ణయం తీసుకుంది ఏపీ ఆంధ్ర ప్రభుత్వం. కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ సోలార్ ఎనర్జీ కార్పోరేషన్ ఆఫ్ ఇండియా తో ప్రస్తుత డిస్కం లు కుదుర్చుకున్న ఒప్పందాన్ని ఏపీ రాస్కామ్ కు బదిలీ చేయాలని నిర్ణయించింది  ఆంధ్ర ప్రదేశ్‌ ప్రభుత్వం.


ఏపీ లోని మూడు డిస్కం లకు ఏపీ రాస్కామ్ చెల్లించే వీలింగ్ ఛార్జీలు, విద్యుత్ ట్రాన్స్ మిషన్ ఛార్జీలు, ఫీడర్ సె గ్రిగేషన్ ఛార్జీలు, ఇతర వ్యయాన్ని ఎలక్ట్రిసిటీ డ్యూటీగా వినియోగదారుల నుంచి వసూలు చేయాలని నిర్ణయం తీసుకుంది ఆంధ్ర ప్రదేశ్‌ సర్కార్‌. కా గా.. ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్ర కేబినేట్‌... నిన్న సమావేశం అయిందన్న విషయం మనందరికీ తెలిసిందే.  ఈ నేపథ్యంలో  ఈ నిర్ణయాలు తీసుకుంది ఆం ధ్ర ప్రదేశ్‌. అలాగే.... అమ్మ ఒడి,  సినిమా టికెట్ల విక్రయాలు,  ఏపీ ఆర్థిక సమస్యలపై కూడా కీలక నిర్ణయాలు తీసుకుంది జగన్ సర్కార్. 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: