అయ్య బాబోయ్.. కరోనా కట్టడికి బ్రిటన్ ఎంత ఖర్చు చేసిందో తెలుసా?
మిగతా దేశాలతో పోల్చి చూస్తే అటు ఇటు కరోనా వైరస్ కట్టడికి భారీగా ఖర్చు చేసినట్లు తెలుస్తోంది. టెస్టింగ్, ట్రేసింగ్ కోసమే ఖర్చు పెట్టినట్లు తెలుస్తుంది. ఇక ఇందులో భాగంగానే బ్రిటన్ ప్రభుత్వం ఏకంగా 37 మిలియన్ పౌండ్లు అంటే భారత కరెన్సీ ప్రకారం ఏకంగా మూడు లక్షల కోట్ల రూపాయలను ఖర్చు పెట్టినట్లు నివేదికలో వెల్లడయ్యింది. బ్రిటన్లో కరోనా వైరస్ కేసులు వెలుగులోకి వచ్చినప్పటి నుంచి ఎక్కువగా టేస్టింగ్, టేస్టింగ్ పైనే దృష్టి పెట్టింది బ్రిటన్ ప్రభుత్వం. దీని కోసం ప్రైవేటు కాంట్రాక్టర్లఫై ఎక్కువగా ఆధార పడుతూ వచ్చింది. దీంతో ఇక బ్రిటిష్ ప్రభుత్వానికి ఖర్చు ఊహించనంత భారీగా అయింది అని చెప్పాలి.
అయితే బ్రిటన్ ప్రభుత్వానికి కరోనా వైరస్ కట్టడిలో సరైన ప్రణాళిక లేకపోవడం కారణంగానే ఇంత భారీ ఖర్చు చేయాల్సి వచ్చింది అని అటు కొంతమంది నిపుణులు కూడా విమర్శలు గుప్పించారు. అయితే వైరస్ తీవ్రంగా విజృంభించిన దేశాలలో బ్రిటన్ కూడా ఒక దేశంగా కొనసాగింది. ఒకానొక దశలో బ్రిటన్ ప్రపంచంలోనే అత్యధిక కేసులు వెలుగులోకి వస్తున్న దేశంగా రెండవ స్థానంలో నిలిచింది. అయితే బ్రిటన్ ప్రభుత్వం ఖర్చులకు సంబంధించిన పూర్తి వివరాలను తెలుసుకునేందుకు అక్కడ హౌస్ ఆఫ్ కామన్స్ కు చెందిన పబ్లిక్ అకౌంట్స్ కమిటీ నివేదికను కూడా అందించడం గమనార్హం. అయితే అత్యుత్సాహం కారణంగానే ఇలా వైరస్ కట్టడిలో భారీ మొత్తంలో ఖర్చు అయింది అని కమిటీ అభిప్రాయం వ్యక్తం చేసింది. ఇక భారీ మొత్తంలో ప్రజాధనం వృధా కావడం మాత్రం ఆందోళనకరంగా మారింది అని కమిటీ అభిప్రాయం వ్యక్తం చేసింది.