చంద్రమా!.. అమిత్‌షా ఫోన్‌కే అమితానందమా..!

Chakravarthi Kalyan
చంద్రబాబు ఢిల్లీకి వెళ్లారు.. వచ్చారు.. మరి ఢిల్లీలో ఏంచేశారు.. రాష్ట్రపతిని కలిశారు. ఏపీలో జగన్ సర్కారు అన్నీ అరచకాలు చేస్తోంది అధ్యక్షా అంటూ విన్నవించుకున్నారు. ఓకే.. మరి ఆ తర్వాత.. ఆ తర్వాత ఇంకా ఏముంది.. ఏమీ లేదు.. చక్కా హైదరాబాద్ ఫ్లయిట్ పట్టుకుని వచ్చేశారు. అయితే.. మరి ఏపీలో వైసీపీ ఇన్ని అరాచకాలు చేస్తుంటే.. ఎందుకు కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు ఫిర్యాదు చేయలేదన్న ప్రశ్న రాలేదు. అందుకే చంద్రబాబు అమిత్ షాను కలిసేందుకు అపాయిట్‌మెంట్ కోరారు.

కానీ ఎందుకనో అమిత్‌ షా చంద్రబాబుకు మాత్రం అపాయిట్ మెంట్ ఇవ్వలేదు. మొత్తానికి కేంద్ర హోంమంత్రి అమిత్ షా ను కలవకుండానే చంద్రబాబు హైదరాబాద్‌కు వచ్చేశారు. అయితే అమిత్‌ షా కాశ్మీర్ పర్యటనలో ఉన్నారు కాబట్టి చంద్రబాబును కలవలేదని.. లేకపోతే.. అమిత్ షా కూడా మా చంద్ర బాబు తీసుకున్నాడని ఎల్లో మీడియా ప్రచారం దంచేసేదే అన్న వాదన లేకపోలేదు. మొత్తానికి చంద్రబాబు కేంద్ర హోంమంత్రి అమిత్ షాను కలవకుండానే హైదరాబాద్‌కు చంద్రబాబు తిరిగి వచ్చేశారు.

అయితే చంద్రబాబు హైదరాబాద్‌కు వచ్చీ రాగానే.. అమిత్‌ షాకు చంద్రబాబు కలలోకి వచ్చాడట. ఏమోయ్.. అమిత్తూ.. ఆ చంద్రబాబు ఏదో కలుస్తానంటున్నాడుగా అని ఏ ఆకాశవాణి ఆదేశించిందో.. మొత్తానికి అమిత్‌ షా చంద్రబాబు కు ఫోన్‌ చేశాడని ఎల్లో మీడియా ఒకటే ఊదరగొట్టేసింది. అమిత్‌ షా చంద్రబాబు కు ఫోన్‌ చేసి కాశ్మీర్ పర్యటనలో ఉన్నందున తాను చంద్రబాబు కలుసుకోలేకపోయానని వివరణ ఇచ్చారట. ఈ సమయంలో చంద్రబాబు రాష్ట్ర పరిస్థితుల గురించి అమిత్‌ షాకు వివరించారు.

ఈ కథ బాగానే ఉంది కానీ.. అంతా అబద్దం అంటోంది అధికార వైసీపీ. అయినా అమిత్‌షా కేవలం ఫోన్ చేస్తేనే అంతగా ఆనందపడిపోతే.. రేపు నిజంగా కాల్ చేసి మాట్లాడితే పరిస్థితి ఎలా ఉంటుందో అంటూ జోక్‌లు వేసుకుంటున్నారు. అదీ సంగతి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: