కేసీఆర్ vs ఈటల: ఓడితే ఈటల పరిస్థితి ఏంటి..?
అలాంటి ఈటలకు కేసీఆర్‌కు ఎక్కడో చెడింది. అందుకే ఏకంగా మంత్రి పదవిలో ఉన్న పార్టీ నుంచి బయటకు పంపేశారు. ఈటలకు పోరాటం తప్ప వేరే మార్గం లేకుండా చేశారు. ఈటల సైతం తన శక్తి మేరకు కేసీఆర్‌ను ఎదుర్కొనేందుకు సిద్ధమయ్యారు. కేసీఆర్‌తో పోరాటం అంటే మామూలు విషయం కాదు కదా.. అందుకే బీజేపీలో చేరారు.. బీజేపీ అభ్యర్థిగా హుజూరాబాద్‌లో తలపడుతున్నారు. అయితే కేసీఆర్ ఈటలను ఓడించేందుకు అన్ని ఏర్పాట్లు చేశారు. స్థానికుడిగా.. టీఆర్‌ఎస్ నుంచి బయటకు పంపేసిన వాడిగా మొదట్లో ఈటలకు సెంటిమెంట్, సానుభూతి ఉన్నా.. కేసీఆర్ క్రమంగా దాన్ని అధిగమించేలా ఎత్తులు వేసుకుంటూవచ్చారు.
మరి ఈ ఎన్నికల్లో ఈటల ఓడితే ఆయన రాజకీయ భవితవ్యం ఏంటి.. ఇప్పటికే బీజేపీలో ఆయనకు పెద్దగా ప్రాధాన్యం దక్కట్లేదు. ఆయన గెలుపు కోసం బీజేపీలో అంతా కలసిపోరాడుతున్న పరిస్థితి కనిపించడం లేదు. అలాంటిది ఇక ఓడితే.. ఈటల బీజేపీలో కొనసాగగలుగుతారా.. వచ్చే అసెంబ్లీ ఎన్నికల వరకూ బీజేపీలోనే ఉండి.. మరోసారి కేసీఆర్ పై పోరాడగలుగుతారా.. అన్నది సందేహాస్పదమే. ఎందుకంటే.. మొదటి నుంచి ఈటలది బీజేపీ వ్యతిరేక భావజాలం. ఆయన కమ్యూనిస్టు వాది. కేసీఆర్‌పై పోరాడేందుకు వేరే దారి లేక ఆయన బీజేపీ మార్గం ఎంచుకున్నారు. మరి అలాంటిది ఓడితే.. ఆ పార్టీలో కొనసాగే విషయం అనుమానమే. హూజూరాబాద్‌లో ఓడితే.. అది ఈటల రాజకీయ జీవితానికి ముగింపే అన్న విశ్లేషణలూ వస్తున్నాయి. ఒక వేళ ఈటల గెలిస్తే మాత్రం.. బీజేపీకి కొత్త ఊపు వచ్చినట్టే.. బీజేపీలోనూ ఆయన కీలక స్థానం పొందే ఛాన్స్ ఉంటుంది. చూడాలి. ఏం జరుగుతుందో..?