పార్టీ ప్లీనరీ సమావేశం పై నేతలకు దిశా నిర్దేశం చేశారు టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మంత్రి కేటీఆర్. తెలంగాణ ప్రజల ఆకాంక్షను నెరవేర్చింది టిఆర్ఎస్ పార్టీ అని... శాంతి యుతంగా తెలంగాణ రాష్రం సాధించారని కొనియాడారు కేటీఆర్. పాలనలోనూ దేశానికి తెలంగాణకు దుక్సూచిగా మార్చారు,, 25న ప్లీనరీ లో పార్టీ అధ్యక్షున్ని ఎన్నుకుంటామని ప్రకటన చేశారు కేటీఆర్. కోవిడ్ నిబంధనలు పాటిస్తూ ఏర్పాట్లు చేస్తున్నట్ల స్పష్టం చేశారు కేటీఆర్. ప్లీనరీ ఉదయం 10గంటలకే ప్రారంభం అవుతుందని.. పేర్ల నమోదు కోసం 35 కౌంటర్లు ఏర్పాటు చేశామన్నారు.
నాయకుల వ్యక్తిగత సిబ్బంది కోసం కూడా ప్రత్యేక ఏర్పాట్లు చేశామని.. ఆహ్వానించిన వారే రావాలి.. ఆహ్వానం లేని వారిని అనుమతించమని కుండ బద్దలు కొట్టారు కేటీఆర్. అలాగే గులాబీ దుస్తులు ధరించి ప్రతినిధులు ప్లీనరికి రావాలని పేర్కొన్నారు మంత్రి కేటీఆర్. మాజీ ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ, మాజీ జెడ్పి చైర్మన్లకు కూడా ఆహ్వానం పంపామని.. మొదటి సెషన్ లో ఉదయం10నుంచి మధ్యాహ్నం 1గంట వరకు అధ్యక్షుని ఎన్నిక తీర్మానాలు ఉంటాయని స్పష్టం చేశారు కేటీఆర్. మధ్యాహ్నం 2 తర్వాత ప్రసంగాలు ఉంటాయని.. ఏడు తీర్మానాలు ఉంటాయన్నారు.
కేంద్రాన్ని నిలదీస్తూ కూడా తీర్మానం ఉంటుందన్నారు. గాంధీభవన్ లో గాడ్సే జోర్రిండని.. రేవంత్ రెడ్డి, ఈటెల రాజేందర్ గోల్కొండ రిసార్ట్స్ లో కలవలేదని చెప్పండి ? అని సవాల్ విసిరారు కేటీఆర్. అప్పుడు ఆధారాలు బయట పెడతాం.. చూసిన వారే మాకు చెప్పారన్నారు. బీజేపీ, కాంగ్రెస్ ల ఉమ్మడి అభ్యర్థే ఈటెల రాజేందర్ అని.. ఎన్నికల కమిషన్ కూడా పరిధి అతిక్రమించిందని ఫీ అయ్యారు కేటీఆర్. రాజ్యాంగ బద్ధ సంస్థ అని మరిచిపోయారని.. పక్క జిల్లాల్లో కూడా కోడ్ అనడం ఆశ్చర్యమని తెలిపారు.
తను తీసుకున్న సూపారి మీద మానిక్కం మాట్లాడితే బాగుం టుం దన్నారు..