వావ్.. 4 భారీ రైళ్ల ప్రయోగం సక్సెస్?

praveen
భారత రైల్వే శాఖ ఇటీవలికాలంలో ఎంతగానో అభివృద్ధి జరుగుతుంది అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. అటు ప్రయాణికులు అందరికీ ఎక్కడ ఇబ్బందులు తలెత్తకుండా ఉండేలా అన్ని రకాల ఏర్పాట్లు చేస్తోంది. అయితే కేవలం రైలు సర్వీసులను పునరుద్ధరిస్తూ సరికొత్త టెక్నాలజీని వాడటమే కాదు అటు రైల్వే స్టేషన్ లను సైతం సరికొత్త విధంగా తీర్చి దిద్దుతుంది అనే విషయం తెలిసిందే. దాదాపు దేశంలోని అన్ని రైల్వే స్టేషన్ లు కూడా కొత్త హంగులతో తీర్చి దిద్దుకున్నాయి. అంతేకాకుండా ఇక రైల్వే శాఖలో మరికొంత టెక్నాలజీ ని తీసుకువచ్చి అటు రవాణాను కూడా మరింత సులభతరం చేసేందుకు భారత రైల్వేశాఖ నిర్ణయించింది.

 ఈ క్రమంలోనే భారీ రైళ్లను నడిపేందుకు గత కొన్ని రోజుల నుంచి రైల్వే శాఖ తీవ్రస్థాయిలో కసరత్తు చేస్తోంది అనే విషయం తెలిసిందే.  దీనికి సంబంధించి ప్రయోగాలు కూడా నిర్వహించింది భారత రైల్వే శాఖ. రైల్వే రవాణా వ్యవస్థను సరి కొత్త పుంతలు తొక్కుతూ ముందుకు సాగుతుంది. ఇక ఇప్పుడు మరోసారి ఇలాంటిదే ప్రయత్నించి సక్సెస్ అయ్యింది భారత రైల్వే శాఖ. ఏకంగా అతి పొడవైన రైళ్లను నడిపింది.  ఇటీవల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏకంగా ఒకేసారి 150కిపైగా బోగీలతో ఒక భారీ పొడవైన రైలు నడపడం అందరిని ఆశ్చర్యానికి గురిచేసింది అనే విషయం తెలిసిందే.

 ఇక ఇప్పుడు మరో ముందడుగు వేసింది భారత రైల్వే శాఖ.  ఈ క్రమంలోనే ఇటీవలే ఒకేసారి మూడు వేరు వేరు గమ్యాలకి త్రివేణి అనే పేరుతో మూడు అతి పొడవైన రైళ్లను నడిపించింది దక్షిణ మధ్య రైల్వే శాఖ . ఇలా ఈ మూడు భారీ రైళ్లలో ఇక రెండు రైళ్లకు ఒక్కొక్క దానికి నూట పది బ్యారేల్ లు ఉండగా.. తొమ్మిది వందల కిలోమీటర్ల వరకు ప్రయాణించాయ్. ఇక మొత్తంగా చూసుకుంటే ఇలా మూడు వేరు వేరు మార్గాలకి మూడు ప్రత్యేకమైన రైళ్లను నడిపినట్లు తెలుస్తోంది.  ఇలా అటు రైల్వేశాఖలో కొత్తగా భారీ రైళ్లను నడుపుతూ రవాణా వ్యవస్థను మరింత సమర్థవంతంగా మరింత సులభతరం చేసేందుకు రైల్వే శాఖ ప్రయత్నిస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: