ఈటల కోసం ఇన్ని ఆటలు..విజయం సాధిస్తారా..?

MOHAN BABU
ఈటెల కోసం ఎక్కడికైనా, ఎందాకైనా అంటున్నారట అమిత్ షా. అవును కేంద్ర హోంమంత్రి బిజెపి వ్యూహకర్త అమిత్ షా ఈటెల కోసం దేనికైనా రెడీ అంటున్నారట. హుజురాబాద్ గెలుపుకు అదిరిపోయే వ్యూహాం నూరి పోసిన అమిత్ షా ఈటల కు మరో సర్ప్రైజ్ ఇవ్వడం ఖాయం అంటున్నారు పార్టీ నేతలు. రెండు మూడు రోజుల్లోనే అది తేలిపోతుందని కూడా ఢిల్లీ నుంచి సిగ్నల్ అందుతున్నాయట. ఇక్కడ గెలిస్తే వచ్చే ఎన్నికల్లో హీరో ఎవరో జీరో ఎవరో ఒక హైప్ క్రియేట్ అవుతుంది. ఆ హైప్ కు హోప్ లాంటి హుజురాబాద్ గెలుపు కోసం తెలంగాణ రాష్ట్ర సమితి సకల శక్తులు దారబోస్తుంది. బైపోల్స్ లో టిఆర్ఎస్ కు విజయాన్ని అందించే చాణిక్యుడు హరీష్ రావుకు బాధ్యతలు అప్పగించింది. సీఎం కేసీఆర్ బహిరంగ సభ కూడా ఉండబోతోందని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో టీఆర్ఎస్ కంటే కూడా బీజేపీకి ఇంకాస్త ఎక్కువ కీలకమైన ఎన్నిక హుజురాబాద్ బై పోల్. అందుకే ఏకంగా హోం మంత్రి అమిత్ షా  నేరుగా రంగంలోకి దిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆ దిశగా ప్రయత్నాలు మొదలయ్యాయని బిజెపి సర్కిల్స్ లో చర్చ జరుగుతోంది. హుజురాబాద్ బైపోల్ కోసం ఢిల్లీ నుంచే వ్యూహాలు నిర్దేశిస్తున్నారు అమిత్ షా. ఏఏ అంశాల్లో టిఆర్ఎస్ ను ఇరుకున పెట్టాలో డైరెక్షన్ ఇస్తున్నారు.

తెలంగాణ విమోచన దినోత్సవం రోజు తెలంగాణకు వచ్చిన అమిత్ షా  ఈటెల ను  ప్రత్యేకించి ప్రస్తావించారు. గెలిపించాలని పిలుపునిచ్చారు. అనేక స్ట్రాటజీ లలో ఈటెలకు, బండి సంజయ్ కు వివరించారు. అంతేకాదు ఓ అడుగు ముందుకేసి బిజెపి ప్రచారాన్ని హోరెత్తించేందుకు హుజరాబాద్ బహిరంగ సభకు అమిత్ షా రాబోతున్నారని తెలుస్తుంది. డేట్ ఇప్పుడే పిక్స్ కాకపోయినా ఆ దిశగా ప్రయత్నాలు జరుగుతున్నాయట. అదే జరిగితే తన క్యాంపెయినింగ్ కి ఎంతో ఉపస్తుందని ఆశిస్తున్నారు ఈటెల రాజేందర్. ఇప్పుడు పార్టీకి అత్యంత కీలకమైన హుజురాబాద్  ప్రచారానికి అమిత్ షా వస్తే బాగుంటుందని అందరూ అనుకుంటున్నారట. షా తప్పకుండా హుజురాబాద్ క్యాంపెయినింగ్ కి వస్తారని నేతలతో పాటు క్యాడర్ కూడా భావిస్తోంది. ఒకవైపు టిఆర్ఎస్ అభ్యర్థి కోసం కెసిఆర్ బహిరంగ సభ పెట్టడం కాయం గా కనిపిస్తోంది.అటు కాంగ్రెస్ నుంచి కూడా  ఇప్పటికే రేవంత్ రెడ్డి అనేక రోడ్ షో లలో పాల్గొన్నారు. రాబోయే రోజుల్లో కాంగ్రెస్ జాతీయ నాయకులు కూడా రంగంలోకి దిగే అవకాశం ఉంది. దీంతో బీజేపీ కూడా నేషనల్ లీడర్స్ ని ఆహ్వానిస్తున్న సెంటిమెంట్ పరంగా అమిత్ షా కూడా వస్తారని భావిస్తోంది. కెసిఆర్ సభ తర్వాత ఉంటుందో లేదా ముందే అమిత్ షా సభ  ఉంటుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: