పాక్ కి ఆహ్వానం పంపిన భారత్.. ఎందుకో తెలుసా?

praveen
ఇటీవల ఆఫ్ఘనిస్థాన్ లో తాలిబాన్లు ఆయుధాలతో ఆధిపత్యాన్ని చేపట్టారు.  తాత్కాలిక ప్రభుత్వాన్ని కూడా ఏర్పాటు చేశారు. ప్రస్తుతం తాలిబన్లు షరియా చట్టాలను అమలు చేశారు. అయితే ఒకప్పుడు ఆఫ్ఘనిస్తాన్ తో భారత్ కి ఎంతో సత్సంబంధాలు కొనసాగేవి. ఆఫ్ఘనిస్థాన్లో  ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలను కూడా చేపట్టింది భారత్.  ఇక ఆప్ఘనిస్తాన్ విషయంలో ఎప్పుడూ పెద్దమనసు చాటుకుంటూ ఉండేది. కానీ ఆఫ్ఘనిస్తాన్ లో తాలిబన్లు ఆధిపత్యం లోకి వచ్చిన తర్వాత ఈ రెండు దేశాల మధ్య ఉన్న సంబంధాలు పూర్తిగా తెగిపోయాయి. ఇక అటు తాలిబన్లు ప్రపంచ దేశాలతో సత్సంబంధాలు కోసం చర్చలు జరుపుతున్నారు. ఇలాంటి నేపథ్యంలో భారత్ కూడా ఆఫ్ఘనిస్తాన్ ఎలాంటి సంబంధాలు కొనసాగించాలి అనే దానిపై చర్చకు సిద్ధమైనట్లు తెలుస్తోంది.

 అయితే ఈ క్రమంలోనే అటు పాకిస్తాన్తో కూడా భారత్ చర్చించేందుకు సిద్ధమైంది. సాధారణంగా భారత దాయాది దేశమైన పాకిస్తాన్ తో భారత్ ఎప్పుడూ చర్చలు జరిపేందుకు సిద్ధంగా ఉండదు. ఉగ్రవాదానికి కేరాఫ్ అడ్రస్ అయిన పాకిస్థాన్ ను తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఉంటుంది భారత్. కాశ్మీర్ విషయంలో చర్చలు కోసం  పాకిస్తాన్ కి ఎన్ని సార్లు కోరినప్పటికీ చర్చలు జరిపేది లేదు అంటూ తేల్చి చెప్పింది భారత్.  గతంలో 370 ఆర్టికల్ రద్దు విషయంలో కూడా పాకిస్థాన్ చర్చలు జరపాలని ప్రయత్నించినప్పటికీ దానికి కూడా భారత అంగీకరించ లేదు. కానీ ఇప్పుడు ఆఫ్ఘనిస్తాన్ విషయంలో మాత్రం చర్చలు జరిపేందుకు భారత్ పాకిస్తాన్ ను కూడా ఆహ్వానించినట్లు తెలుస్తోంది.

 ఇది కాస్త ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారిపోయింది. రష్యా భారత్ కలిసి తాలిబన్లతో చర్చలు జరుపుతున్నాయి. అయితే తాలిబన్లను పెంచి పోషించిన పాకిస్తాన్ కి కూడా ఈ చర్చలకు భారత్ ఆహ్వానం పంపినట్లు తెలుస్తోంది. అయితే ఈ చర్చలలో ఆఫ్ఘనిస్తాన్ తో సంబంధాల పై భారత్ పూర్తిస్థాయి క్లారిటీ తెచ్చుకోవాలి అనుకుంటున్నట్లు ప్రస్తుతం విశ్లేషకులు చెబుతున్నారు. ఆఫ్ఘనిస్తాన్ ను వశం చేసుకున్న తాలిబన్లు భారత్కు వ్యతిరేకంగా ఉన్నారా లేదా అనే విషయంపై కూడా ఈ చర్చల తర్వాత పూర్తిస్థాయి స్పష్టత వచ్చే అవకాశం ఉంది అని అంటున్నారు విశ్లేషకులు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: