పెళ్లయిన జంట ఆట.. అందులో వరుడికి దెబ్బ.. అది ఎక్కడంటే..?
మన దేశంలో మన సంప్రదానికి అనుగుణంగా ఇలాంటి ఆటలు ఉంటాయి. కానీ వేరే దేశాలలో వారి సంప్రదాయాలకు అనుగుణంగా ఆటలు ఉంటాయి. అలా నవజంట ఆడిన ఆట సోషల్ మీడియాలో తెగ వైరలైంది. వారు ఆడిన ఆడిన ఆట ఏమిటంటే.. రౌండర్స్ బాల్. ఆటలో పెళ్లికొడుకుకు తగలరాని చోట దెబ్బ తగిలింది. అతడు కిందపడి కొట్టుకున్నాడు. వివరాల్లోకి వెళ్లితే.. ఇంగ్లాండ్‌లోని కార్లియాన్‌బే హోటల్ గార్డెన్‌లో ఓ జంటకు వివాహం జరిగింది. ఆ తరువాత వెంటనే ఆ దంపతులు రౌండర్స్‌బాల్ ఆడారు. తొలుత వరుడు ఫీల్డ్ బాల్ వేశాడు. అటుగా వచ్చిన బాల్‌ను బ్యాట్‌తో కొట్టడానికి వదువు సిద్ధంగా ఉన్నది. వరుడు వేసిన బాల్ ను వదువు బలంగా బాదింది. అది నేరుగా వరుడి ప్రయివేటు పార్ట్‌లో తాకింది. ఆ వరుడు నొప్పి భరించలేక అక్కడికక్కడే కుప్పకూలిపోయాడు. అంతేకాదు గిలగిల కొట్టుకున్నాడు కూడ.
ఇది స్వయంగా చూసిన వారందరూ పకపక నవ్వుతున్నారు. భర్తకు దెబ్బ తగిలిన విషయం భార్యకు తెలియక రౌండ్లు వేస్తూనే ఉంది. అది గమనించిన పెళ్లి వీడియో గ్రాఫర్ అలెగ్జాండర్ తన కెమెరాలో బంధించాడు. ఈ విషయాన్ని వధువు సోదరి హేలిమెక్‌డొనాల్డ్ టిక్‌టాక్‌లో షేర్ చేసింది. అక్కడే ఉన్న కొంత మంది వెంటనే వరుడి వద్దకు చేరుకొని ఓదార్చారు. కొద్ది సేపటి తరువాత వధువు వచ్చి.. ఆర్‌యూ ఓకే బేబీ అని ఓదార్చింది. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. పలువురు నెటిజన్లు వారికి తోచిన విధంగా పలు కామెంట్లు చేశారు. పాపం... సరదాకు ఆటాడపోతే.. అకస్మాత్తుగా ఇలా జరిగిందా అంటూ కామెంట్ చేస్తున్నారు.