వైసీపీ ఎంపీ, ఎమ్మెల్యే ఇద్దరికి షాక్ ఇచ్చేసిన జగన్ ..!
త్వరలోనే రాజమండ్రి కార్పొరేషన్ ఎన్నికలు రానున్నాయి. అయితే రాజమండ్రి కార్పోరేషన్ కు ఎప్పుడు ఎన్నికలు వచ్చినా సిద్ధంగా ఉండాలని జగన్ ఇప్పటికే నేతలను ఆదేశించారు. అయితే వైసీపీలో నేతల మధ్య విభేదాలు తీవ్రంగా ఉండడంతో జగన్ రాజా, భరత్ వర్గాలను కలిపేందుకు ట్రై చేశారు. అయితే లోపల మాత్రం వీరు కలిసే అవకాశాలు లేవన్న నివేదికలు జగన్ దగ్గర కు వెళ్లి పోయాయి. ఇదే పరిస్థితి ఉంటే కార్పోరేషన్ ఎన్నికల సాక్షిగా ఈ ఇద్దరు నేతలు ఒకరిని మరొకరు దెబ్బ తీసుకునేందుకు ప్రయత్నాలు చేస్తారన్న సందేహం జగన్ కు వచ్చేసింది.
అందుకే కార్పోరేషన్ ఎన్నికల్లో గెలుపు కోసం జగన్ ఓ సమన్వయ కమిటీని నియమించాలని డిసైడ్ అయినట్టు తెలుస్తోంది. అంటే రేపటి ఎన్నికల వేళ ఈ సమన్వయ కమిటీ సూచన మేరకే టిక్కెట్ల కేటాయింపు దగ్గర నుంచి ప్రచారం .. ఇతరత్రా వ్యవహారాలు నడుస్తాయి. అంటే భరత్, రాజా లకు ఈ ఎన్నికలలో పెత్తనం ఉండదు. ఆ కమిటీ చెప్పిన వారికే టిక్కెట్ల కేటాయింపు ఉంటుంది. ఈ సమన్వయ కమిటీకి మంత్రిని ఒకరు ఛైర్మన్ గా నియమిస్తారట. ఏదేమైనా రాజా, భరత్ దూకుడుకు జగన్ బ్రేకులు వేసినట్టే అని పార్టీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది.