ఆర్కే ప్రేమ క‌థ తెలుసా?

RATNA KISHORE


ఆర్కే - శిరీష - మున్నా ఈ ముగ్గ‌రూ ఉద్య‌మాల‌కు తెలిసిన పేర్లు. వేద‌న భ‌రించిన పేర్లు. అడ‌వికి బాగా ప‌రిచ‌యం అయిన పేర్లు.. ప్రేమ బంధాలు చావు వ‌ర‌కూ తోడుంటాయి..అవి ప‌విత్రం అయితే..శిరీష ప్రేమ అతి ప‌విత్రం అని చెప్పాలి. నా బిడ్డ ఉద్య‌మంలో చ‌నిపోయాడు . ఇప్పుడు నా భ‌ర్త ఉద్య‌మంలో ఉంటూ చ‌నిపోయాడు.. పోలీసులే చంపి ఉంటారు అన్న‌ది ఆమె ఆరోప‌ణ. విషాహారం తినిపించి చంపించార‌ని ఆమె అభియోగం. వీటిపై ఆమె మాట్లాడుతూ..ఆయ‌న‌పై మూగ ప్రేమ‌ను మాత్రం వెల్ల‌డి చేస్తూనే ఉన్నారు. మంచి ప్రేమ‌కు అడ‌వి ఓ గొప్ప సాక్షి.. నేను అక్క‌డికి వెళ్ల‌లేను.. నీవు ఇక్క‌డికి రాలేవు.. ఎన్నాళ్లిలా అన్న వేద‌నే వారిది అని రాశారు ఓ చోట ఆ కుటుబం గురించి తెలిసిన ప‌లాస‌కు చెందిన సుమ అరుణ.

ప‌లాస క‌థ‌లు, ప‌లాస రీతులు ఆర్కేకు తెలుసు.. మా నేల నుంచి ఎదిగివ‌చ్చిన లీడ‌ర్ ఆయ‌న అని అంటారామె! ప్రాంతాల‌కు అతీతంగా ఉద్య‌మం ఒక‌ప్పుడు అడ‌విలో ఉంది. ఇప్పుడూ ఉంది. మ‌నుషులకు అన్యాయం జరుగుతోంది. ఇంకా చెప్పాలంటే మ‌నుషులే అడ‌వికి అన్యాయం చేస్తూ ఉన్నారు. ప్రేమ పూర్వ‌కంగా మాట్లాడి చాలా కాలం అయిపోయింది. ఇప్పుడు అడ‌వి ఆర్కేను కోల్పోయింది.

గొంతును కోల్పోయింది. హ‌క్కుకు సంకేతిక ఆ గొంతు. ఆయ‌న బిడ్డ మున్నా ఎప్పుడో మ‌ర‌ణించాడు. కానీ ఆ త‌ల్లి ఆ ఇద్ద‌రి మ‌ర‌ణం త‌ల్చుకుని క‌న్నీటి రేఖ‌ల చెంత గ‌త కాలాన్ని నిర్మిస్తూ ఉంది. క‌ల‌ల‌ను స్మ‌రిస్తూ ఉంది. బంధాల‌ను స్మ‌రిస్తూ ఉంది.ప్రేమ గొప్ప‌ది అని చెప్ప‌డంలో చిన్న త‌నం ఉంది.. అంత‌కుమించిన అర్థం ఏదో వెత‌కాలి అంతా!
రేగే మూగ త‌ల‌పే వ‌ల‌పు పంట రా.. వింటున్నానీ మాట.. అడ‌విలో ఉన్న అన్న ఆర్కే కు ఓ మంచి ప్రేమ క‌థ ఉంది అని చ‌దివేను. అగ్ర‌వ‌ర్ణంకు చెందిన ఆయ‌న ఓ ద‌ళిత మ‌హిళ‌ను ప్రేమించి పెళ్లాడారు. న‌మ్మిన సిద్ధాంతాల కోసం క‌డ‌దాకా పోరాడారు అంటూ క‌న్నీటి ప‌ర్యంతం అవుతోంది ఉద్దానానికి చెందిన ఆయ‌న సానుభూతి వ‌ర్గం. వీరి ప్రేమ క‌థ గురించి  చెప్పి భావోద్వేగం అవుతున్నారు ప‌లాస ప్రాంతానికి చెందిన సుమ అరుణ‌. మా జిల్లాకూ ఆర్కేకూ మంచి అనుబంధం ఉంది. శ్రీ‌కాకుళం పోరాటం, ఉద్య‌మం అంటే ఎవ‌రికి ఆరాధ‌న ఉండ‌ద‌ని.. ఎన్నో అవ‌స్థ‌లు దాటి ఆర్కే గొప్ప స్థాయికి ద‌ళంలో చేరుకున్నారు. ఎన్టీఆర్ ఉద్యోగం ఇస్తామ‌న్నా వ‌ద్ద‌ని చెప్పార‌ట ఓ సంద‌ర్భంలో! అప్ప‌టికింకా ఆయ‌న ఉద్య‌మంలో  చేర‌లేదు. కానీ నాన్నకు మాత్రం ఆయ‌న‌కో దారి చూపాల‌నే ఉండేది. కానీ ఆర్కే వ‌ద్ద‌న్నారు. ఇంటి పేరు అక్కిరాజు పూర్తి పేరు హ‌ర‌గోపాల్. ఉద్య‌మంలో చేరాక చాలా పేర్లు వ‌చ్చాయి. చాలా ఊర్లు మారారు. అయినా ప్రేమ మాత్రం అలానే ఉంది. ఆ ప్రేమ శిరీష‌ది. ఆ ప్రేమ మార‌నిది. ఆ క‌థ చాలా గొప్ప‌ది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: