బడా లీడర్లతో హాట్ వీడియోలు.. బెదిరించి కోట్లు కొట్టేస్తున్న కిలాడీ..?

Chakravarthi Kalyan

హనీట్రాప్.. అంటే తేనె వల.. అంటే అమ్మాయిలు, యువతులు, ఆంటీలు.. కావాలని కొందరితో సన్నిహితంగా మెదలడం.. ఆ సాన్నిహిత్యాన్ని ఉపయోగించుకుని ఆ తర్వాత బ్లాక్‌మెయిల్ చేయడం.. ఇప్పుడు ఈ ట్రెండ్‌ బాగానే కనిపిస్తోంది. అనేక రంగాల్లో ఈ హానీట్రాప్‌ ఘటనలు జరుగుతున్నాయి. గతంలో సైన్యంలో ఈ హానీ ట్రాప్ ఘటనలు కనిపించాయి. గతంలో ఇలా కొందరు సైనికులను  ప్రలోభ పరుచుకుని.. వారితో హాట్ గా చాట్‌ చేసి.. ఆ వీడియోలు బయటపెట్టకుండా ఉండేందుకు దేశ రహస్యాలు ఇవ్వాలని అడిగిన ఉదంతాలు కూడా చోటు చేసుకున్నాయి.

ఇప్పుడు బెంగళూరులో అనేక మంది రాజకీయ నాయకులు ఈ హనీ ట్రాప్‌ వలలో పడి గిజగిజా కొట్టుకుంటున్నారు. ఎందుకంటే.. ఈ సారి వల పన్నింది ఏకంగా ఓ రాజకీయ నాయకురాలు. మాంచి హాట్ ఫీచర్లున్న ఈ నాయకురాలు.. వివిధ పార్టీల నాయకులతో పార్టీ చర్చల కోసం తరచూ కలుస్తుంటుంది. అదే సమయంలో ఆమె కొందరు నాయకులతో చాలా సన్నిహితంగా మెలిగింది. ఆ సాన్నిహిత్యాన్ని పడక గది వరకూ చాకచక్యంగా తీసుకెళ్లింది.

ఇప్పుడు ఆ వీడియోలు బయపెడతానంటూ ఆ నాయకురాలు.. అనేక మంది ప్రజాప్రతినిధులను బ్లాక్ మెయిల్ చేస్తోందట. ఇప్పటివరకూ అనేక ఉదంతాలు చూసినా.. ఏకంగా ఓ నాయకురాలు ఇలా చేయడం మాత్రం విశేషంగానే చెప్పుకోవచ్చు. తనతో నగ్నంగా ఉన్న వివిధ పార్టీలకు చెందిన నాయకుల చిత్రాలను ఈ నాయకురాల చూపించి  బెదిరించి నగదు లాక్కుంటోంది.
మొత్తానికి ఈ విషయం ఇప్పుడు పోలీస్‌ స్టేషన్‌కు చేరిపోయింది. జాతీయ పార్టీకి చెందిన నాయకురాలిని అన్నపూర్ణేశ్వరి నగర పోలీసులు అరెస్టు చేశారని చెబుతున్నారు. కేసు దర్యాప్తులో ఉన్నందున ఇంతకు మించి వివరాలు ఇవ్వడం లేదు. అయితే ఆమె కొప్పళ్‌కు చెందిన బెంగళూరులోనే ఉంటున్నారు. కర్ణాటక రాష్ట్రస్థాయి రాజకీయ పార్టీలో మంచి స్థానంలోనే ఉన్నారు. ఆమె కొంత కాలంగా ఇలా అనేక మందిని బెదిరించి డబ్బులు వసూలు చేసినట్లు పోలీసులు విచారణ తర్వాత నిర్థరించుకున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: